ఫోటో : జ‌న‌సేనానికి పిచ్చి ఫాలోవ‌ర్‌

Monday, October 8th, 2018, 10:30:26 PM IST

జ‌న‌సేనానిగా మారాక ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ డ్రెస్సింగ్ సెన్స్ పూర్తిగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జా సేవ‌కుడిగా చేనేత వ‌స్త్రాల్లో సింపుల్‌గా క‌నిపిస్తున్నాడు. పైజామా- లాల్చీ కాంబినేష‌న్ లో డిజైన‌ర్ డ్రెస్‌ల‌ను కుట్టించుకున్నాడు. వాటిని ధ‌రించి ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కుడిలా జ‌నంలోకి దూసుకెళుతున్నాడు. ఈ స్టైల్‌ని ప‌వ‌న్ పిచ్చి ఫ్యాన్స్ ఎంతో లైక్ చేస్తున్నారు.

కాస్త నిశితంగా ప‌రిశీలిస్తే.. ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న ఈ ఫోటోలో అందాల క‌థానాయిక, హైద‌రాబాదీ అమ్మాయి దియా మీర్జా సైతం జ‌న‌సేనానిని ఫాలో చేస్తోందా? అనిపించ‌క మాన‌దు. అచ్చం ప‌వ‌న్ లాగే ష‌ర్ట్ మ‌డ‌త పెట్టింది.. అచ్చం జ‌న‌సేనానినే త‌ల‌పిస్తూ పైజామా – లాల్చీ(బ్రౌన్ & వైట్ క‌ల‌ర్‌)లో క‌నిపించింది. ఇది యాథృచ్ఛిక‌మేనా? లేక నిజంగానే జ‌న‌సేనానిని ఫాలో చేస్తోందా? అన్న సందేహాల్ని క‌లిగించింది. అయితే దియా మీర్జా ఇదివ‌ర‌కూ ప‌వ‌న్ తో న‌టించింది లేదు. క‌నీసం స్నేహం చేసింది లేదు. అయినా ఇలా యాథృచ్ఛికంగా క‌నెక్ట‌యిపోయిందంతే. అది ఉత్త‌రాదిన పాపుల‌ర్ స్టైల్ అని భావించాలేమో!