ఈసారి ఫిలింఫేర్‌లు బాహుబ‌లి2, ఖైదీకే!

Wednesday, May 30th, 2018, 05:29:03 PM IST

2018 ఫిలింఫేర్ ఉత్స‌వాల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. జూన్ 16న హైద‌రాబాద్ హైటెక్స్‌లో ఈ ఉత్స‌వాల్ని నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. గ‌త ఏడాది త‌ర‌హాలోనే మ‌రోసారి ఫిలింఫేర్ సౌత్ -2018 ఉత్స‌వాల‌కు హైద‌రాబాద్ వేదిక కానుంద‌ని నిన్న‌నే త్రిష ముఖ్య అతిధిగా చెన్న‌య్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ప్ర‌క‌టించారు.

ఆక్ర‌మంలోనే 2017 రిలీజ్‌ల‌లో ఏఏ చిత్రాల‌కు ఫిలింఫేర్‌లు ద‌క్క‌నున్నాయి? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. గ‌త ఏడాది రిలీజైన సినిమాల్లో వ‌ర‌ల్డ్‌వైడ్ సంచ‌ల‌నాలు సృష్టించిన సినిమాలున్నాయి. బాహుబ‌లి 2 చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజై 1700కోట్లు వ‌సూలు చేసింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డులు ద‌క్కాయి. ఇక‌పోతే మెగాస్టార్ ఖైదీనంబ‌ర్ 150 చిత్రంతో రీఎంట్రీ లో దుమ్ము దులిపేశారు. వ‌స్తూనే 160కోట్ల వ‌సూళ్లతో బాస్ ఘ‌న‌మైన రీఎంట్రీని చాటుకున్నారు. జై ల‌వ‌కుశ‌, డీజే, కాట‌మ‌రాయుడు, స్పైడ‌ర్‌, ఫిదా, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, ఎంసీఏ, నేను లోక‌ల్ చిత్రాలు వ‌రుస‌గా ఇదే క్యూలో ఘ‌న‌మైన వ‌సూళ్ల‌తో ఆక‌ట్టుకున్నాయి. అయితే వీటిలో కాట‌మ‌రాయుడు, స్పైడ‌ర్ చిత్రాలు డిజాస్ట‌ర్ టాక్‌ని తెచ్చుకున్నాయి. అయితే అవార్డులు ఏ కోణంలో ఇస్తారో వేచి చూడాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments