ప్ర‌భాస్ (X) చ‌ర‌ణ్‌: వార్‌లో గెలుపెవ‌రిది?

Tuesday, October 17th, 2017, 10:11:16 PM IST

టాలీవుడ్‌లో ఉన్న అగ్ర క‌థానాయ‌కులంద‌రికీ స‌వాల్ విసిరాడు ప్ర‌భాస్‌. అప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం అంద‌రు క‌థానాయ‌కుల్లో ఒక‌డిగా మాత్ర‌మే ఉన్న ప్ర‌భాస్‌, బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత క‌థానాయ‌కుల్ని లీడ్ చేసే స్థాయికి ఎదిగిపోయాడంటే అతిశ‌యోక్తి లేదు. ఇండ‌స్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ కంటే ఎద‌గ‌డం ముఖ్యం. ప‌క్క‌వాడిని మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాలి. ఇత‌ర హీరోల‌ను మించి పారితోషికం అందుకోవాలి. ఛరిష్మాలో ఒక్కొక్క‌రిని వెన‌క్కి నెట్టి ముందుకు సాగాలి. అప్పుడు మాత్ర‌మే హీరోయిజం చెల్లుబాటు అవుతుంది. తానేం చెబితే ఇండ‌స్ట్రీ కూడా తందానా అంటూ తోక ఆడిస్తుంది. ప్ర‌స్తుతం అలాంటి పొజిష‌న్‌ని స్థిరం చేసుకున్నాడు ప్ర‌భాస్‌. ఇప్ప‌టికే త‌న‌కంటూ యువిక్రియేష‌న్స్ లాంటి పెద్ద బ్యాన‌ర్ అండా దండా ఉన్నాయి. ఈ బ్యాన‌ర్ వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్లు నిర్మిస్తూ స‌క్సెస్ జోరులో ఉంది. ఇక ప్ర‌భాస్‌ని డిపెండ్ చేస్తూ ఈ బ్యాన‌ర్లో మ‌రో భారీ చిత్రం తెర‌కెక్కుతోంది. 2018 మోస్ట్ అవైటెడ్ మూవీగా సాహో పేరు వినిపిస్తోంది. అంటే దాని ఉద్ధేశం.. ఇండస్ట్రీలో బాహుబ‌లి రేంజు విజ‌యం సాధించే చిత్రంగా పాపుల‌ర‌వుతోంది. బాహుబ‌లితో వ‌చ్చిన పేరు ప్ర‌ఖ్యాతుల్ని, ధ‌న‌రాశుల్ని సుస్థిరం చేసుకోవాలంటే సాహోని జాతీయ స్థాయిలో రిలీజ్ చేసి పెద్ద విజ‌యం సాధించాలి. అందుకు త‌గ్గ‌ట్టే పూర్తి స్థాయిలో క‌స‌ర‌త్తు చేసి డార్లింగ్ ఎంతో తెలివిగా ఈ చిత్రంలో న‌టిస్తున్నాడు. అందుకే ఇలాంటి క్రేజీ సినిమా వ‌చ్చే ఏడాది ద‌స‌రాకి వ‌స్తోంది అని తెలియ‌గానే అభిమానుల్లో ఒక‌టే ఉత్సాహం. `సాహో`పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. బాహుబ‌లి హీరో న‌టిస్తున్న భారీ యాక్ష‌న్‌ సినిమాగా సాహో బిజినెస్ ఓ రేంజులో సాగ‌నుంది.

అయితే ఇలాంటి క్రేజీ సినిమాతో వ‌స్తున్న ప్ర‌భాస్‌ని ఢీకొట్టేందుకు మ‌గ‌ధీరుడిలా వ‌స్తున్నాడుట రామ్‌చ‌ర‌ణ్‌. ఇండ‌స్ట్రీలో త‌న కెరీర్ రెండో సినిమాతోనే రికార్డులు క్రియేట్ చేసిన హీరోగా చ‌ర‌ణ్‌కి పేరుంది. అత‌డు న‌టించిన `మ‌గ‌ధీర‌` ఇప్ప‌టికీ ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్స్‌లో టాప్ 10లో ఉంది. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి తెర‌కెక్కించ‌నున్న భారీ చిత్రం వ‌చ్చే ఏడాది ద‌స‌రా కానుక‌గా రిలీజ్ కానుందిట‌. అయితే `సాహో` స్పాన్‌తో పోలిస్తే ఈ సినిమా స్పాన్ అంత ఉంటుందా? అన్న‌ది ఆలోచించ‌ద‌గ్గ‌ది. కాబ‌ట్టి చ‌ర‌ణ్ సినిమా సాహోకి ఎంత‌వ‌ర‌కూ పోటీకొస్తుందో చూడాలి. జ‌న‌వ‌రిలో ప్రారంభోత్స‌వం జ‌రుపుకుని ద‌స‌రా రిలీజ్ ల‌క్ష్యంగా తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. 2018 ద‌స‌రాకి స‌మ ఉజ్జీల మ‌ధ్య‌నే ర‌స‌వ‌త్త‌ర‌మైన పోటీ ఉండ‌బోతోంది. అయితే చ‌ర‌ణ్ ఎంచుకున్న కాన్వాసు విజ‌యాన్ని డిక్లేర్ చేస్తుంది.