శ్రీ‌దేవితో బోని కుమారుడు ఎందుకు మాట్లాడ‌డు?

Monday, February 26th, 2018, 12:30:08 AM IST

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి అంత‌ర్ధాన‌మైంది. ఇహ‌లోకం నుంచే భూలోకాన్ని ఏలేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. అయితే శ్రీ‌దేవి మృతిపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి సినీరంగంలో క‌థానాయిక‌ల జీవితాలేవీ పైకి క‌నిపించేంత ఆహ్ల‌దంగా ఉండ‌వ‌న్న‌ది వాస్త‌వం. శ్రీ‌దేవి – బోనిక‌పూర్ జంట ఎంతో అన్యోన్యంగా లైఫ్‌ని లీడ్ చేశారు. కుమార్తెలు జాన్వీ, ఖుషీల జీవితాల్ని తీర్చి దిద్దేందుకు త‌పిస్తున్నారన‌డంలో సందేహం లేదు.

అయితే బోని కుమారుడు అర్జున్ క‌పూర్ మాత్రం వీళ్ల‌కు కాస్తంత దూరంగానే ఉంటాడ‌న్న టాక్ ఉంది. అందుకు ప్ర‌త్యేకించి కార‌ణం కూడా ఉంది. వివాహానికి ముందే నిర్మాత అయిన‌ బోనీ కపూర్‌కు శ్రీదేవితో ఎఫైర్ ఉందని అప్పట్లో అయన మొదటి భార్య, అర్జున్ క‌పూర్ త‌ల్లి మోనా ఆరోపించారు. బోనీకపూర్ కారణంగా శ్రీదేవి గర్భవతి అయ్యారని, అందుకే బోనీ త‌న‌ని పెళ్లాడార‌ని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బోనీ క‌పూర్ శ్రీ‌దేవిని వివాహం చేసుకోవ‌డంతో ఆ ఇంట్లో క‌ల‌త‌లు త‌లెత్తాయి. అలా అర్జున్ క‌పూర్ త‌ల్లి వ‌ద్ద‌నే పెరిగాడు. అందువ‌ల్ల ఇప్ప‌టికీ స‌వ‌తి త‌ల్లి శ్రీ‌దేవి తో మాట్లాడ‌డు. సోద‌రీమ‌ణులైన జాన్వీ క‌పూర్‌, ఖుషీ క‌పూర్‌తోనూ అత‌డికి మాటా మంతీ లేవ‌ని చెబుతారు. సినీరంగంలో స‌రైన అవ‌కాశాలు లేని స‌మ‌యంలో శ్రీ‌దేవి త‌ప్ప‌నిస‌రిగా బోనీక‌పూర్‌ని రెండో పెళ్లి చేసుకుంద‌ని చెబుతుంటారు.