షాక్ .. నయనతార పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా ?

Saturday, October 13th, 2018, 10:14:34 PM IST

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ నయనతార ప్రస్తుతం భిన్నమైన స్క్రిప్ట్ తో సినిమాలు చేస్తూ వారు విజయాలు అందుకుంటుంది. ఇప్పటికే నయనతార తో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే వరుస సినిమాలతో జోరుమీదున్న నయనతార గత కొన్ని రోజులుగా దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రేమలో పడి కూడా చాలా రోజులు అవుతున్నా ఇంకా పెళ్లి వ్యవహారం పై ఎలాంటి స్పందన లేకపోవడంతో అందరు షాక్ అవుతున్నారు.

అయితే నయనతార ఎందుకు పెళ్ళికి నో అంటుందో దర్శకుడు జిటి నందు వెల్లడించారు. గతంలో నయనతార, శింబు, ప్రభుదేవా లతో ప్రేమాయణం జరిపినప్పుడు పెళ్లి గురించి ఓ జ్యోతిష్యుడిని కలిసారుట. అయితే నయనతార పెళ్లి చేసుకుంటే రోడ్డున పడుతుందని, పెళ్లి చేసుకోకుండా ఉంటె ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పాడట. దాంతో ఆమె పెళ్ళికి నో చెబుతుందట. ఈ లెక్కన ఇప్పుడు విగ్నేష్ శివన్ ని కూడా పెళ్లి చేసుకుంటుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సో నయనతార ఫోకస్ సీఎం సీట్ పైనే ఉందా ఏమిటి ?