బన్నీ దూకుడు మామూలుగా లేదుగా…అసలు కారణం తెలుసా?

Wednesday, March 25th, 2020, 09:20:47 PM IST

అల్లు అర్జున్ అలా వైకుంఠ పురంలో చిత్రం బ్లాక్ బస్టర్ విజయం తర్వాత వరుసగా క్రేజీ డైరెక్టర్ లతో చిత్రాలు చేస్తున్నారు. ఆర్య, ఆర్య 2 బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సుకుమార్ తో కొత్త చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడటానికి కారణం కూడా ఇదే. అయితే ఈ చిత్రం అనంతరం అల్లు అర్జున్ ఐకాన్ చిత్రాన్ని చేయనున్నారు. వేణు శ్రీరామ్ ఇప్పటికే క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత ప్రాజెక్ట్ నీ కూడా బన్నీ లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

రేసు గుర్రం, ధ్రువ, సై రా నరసింహ రెడ్డి చిత్రాల విజయాలతో దూసుకుపోతున్న సురేందర్ రెడ్డి తన తర్వాత చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ కి వరుస విజయాలను అందిస్తున్న సురేందర్ రెడ్డి మరొక సారి అల్లు అర్జున్ తో చేయడం తో రేసు గుర్రం తరహాలో అంచనాలు నెలకొనే అవకాశం ఉంది. అల్లు అర్జున్ సైతం సుకుమార్ సినిమా తర్వాత ఐకాన్ తో పాటు ఈ చిత్రంలో కూడా ఓకే సారి నటించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఈ వార్తలు వస్తున్నాయి. మరి దీని పై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి.