“అల వైకుంఠపురములో”కు గురూజీ ఫార్ములా వర్క్ అయ్యేలా ఉంది.!

Friday, December 13th, 2019, 10:00:13 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అల వైకుంఠపురములో” సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ఇటీవలే విడుదల చేసిన టీజర్ మాత్రం మొదటి సారి చూసినపుడు అప్ టు మార్క్ లేదని అంతా తేల్చేసారు.దానికి తోడు సినిమాలో అప్పుడే పాత ఫ్లేవర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అంతా అనుకున్నారు.

కానీ ఈ చిత్రం విషయంలో ఎందుకో గురూజీ ఫార్ములా వర్కౌట్ అయ్యేలాగే అనిపిస్తుంది.మాములుగా త్రివిక్రమ్ తీసే సినిమాలు చూసిన మొదటిసారే బుర్రకెకెక్కకుండా మెల్లగా స్లో పాయిజన్ లా మంచి ట్రీట్ లా మారిపోతాయి.అలాగే అల వైకుంఠపురములో టీజర్ ను మొదటిసారి చూసినప్పుడు పెద్దగా ఎక్కకపోయినా తర్వాత తర్వాత మాత్రం టీజర్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది.ఇదే మ్యాజిక్ పూర్తి స్థాయి సినిమాలో కూడా వర్కౌట్ అయితే మాత్రం తప్పకుండ మంచి ఫలితం దక్కి తీరుతుంది.మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో తెలియాలంటే వచ్చే జనవరి 12 వరకు ఆగాల్సిందే.అయినా అలాంటి మర్చిపోలేని జ్ఞ్యాపకాన్ని ఇచ్చిన “అజ్ఞ్యాతవాసి”ని మర్చిపోయి ఈ సినిమాను కూడా త్రివిక్రమ్ అలాగే తెరకెక్కించే సాహసం చెయ్యరని అనుకుందాం.