అదితీరావ్‌కి ఈసారైనా క‌లిసొస్తుందా?

Friday, June 8th, 2018, 03:00:59 AM IST

అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శ‌ని! అన్న చందంగా ఉందీ అమ్మ‌డి ప‌రిస్థితి. అందానికి అందం.. అభిన‌యం అన్నీ ఉన్నా అదితీరావ్ హైద‌రీకి ఏదీ క‌లిసి రావ‌డం లేదు. 600 కోట్ల క్ల‌బ్ సినిమా ప‌ద్మావ‌త్ 3డిలో న‌టించినా ఈ భామ‌కు గుర్తింపు రాలేదు. మొత్తం క్రెడిట్ అంతా దీపిక ఖాతాలోకే వెళ్లింది. ఆ క్ర‌మంలోనే సౌత్‌లో ప‌లు చిత్రాల‌కు సంత‌కాలు చేసింది అదితీ. నైజాం వార‌స‌త్వంతో ట‌బు త‌ర‌వాత అంత‌టి ఛ‌రిష్మా ఉన్న నాయిక‌గా .. ఇంకా చెప్పాలంటే ట‌బు వార‌సురాలిగా ఈ భామ ఇటు సౌత్‌లో వెలుగులు ప్ర‌స‌రించాల‌నుకుంటోంది. అయితే అందుకు ఆరంభ‌మే అడ్డు త‌గిలింది. ద‌ర్శ‌క‌మ‌ణి మ‌ణిర‌త్నం అంత‌టివాడే హిట్టివ్వ‌లేక‌పోయాడు. ఆరంగేట్ర‌మే `చెలియా` డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ తో మిగ‌తా అంద‌రి కంటే అదితీకే పెద్ద దెబ్బ త‌గిలింది. లేదంటే ఈ అమ్మ‌డిని పెద్ద స్టార్లే అవ‌కాశాలిచ్చేవారేమో! ఆ క్ర‌మంలోనే తెలుగులో సీరియ‌స్‌గానే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈనెల 15న ఈ భామ న‌టించిన‌ `స‌మ్మోహ‌నం` రిలీజ‌వుతోంది. సుధీర్‌బాబు ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు అయితే ఈ సినిమా ప్ర‌చారం ప‌రంగా టూ వీక్‌. ట్రైల‌ర్ బావుంద‌ని టాక్ వినిపించినా స‌రైన ప్ర‌చారం లేక ఈ సినిమా గురించి బ‌య‌ట తెలిసే ప‌రిస్థితే లేదు. మొత్తానికి అదితీరావ్ క్యాలిబ‌ర్‌కి త‌గ్గ సినిమా ఇంకా ప‌డ‌లేద‌నే చెప్పాలి. అటు టాలీవుడ్‌లో ఉన్న అర‌డ‌జ‌ను స్టార్ హీరోల క‌ళ్లు ఇంకా అదితీపై ప్ర‌స‌రించ‌క‌పోవ‌డం అన్న‌ది పెద్ద మైన‌స్ అనే చెప్పాలి.

  •  
  •  
  •  
  •  

Comments