సెన్సేషన్ రేపిన బ్యూటీ సినిమా ఫ్రీగా తెలుగులో.!

Wednesday, June 3rd, 2020, 01:50:06 PM IST

దాదాపు రెండేళ్ల కితం విడుదల జస్ట్ అలా కన్ను కొట్టి యూట్యూబ్ ని షేక్ చేసిన బ్యూటీ “ప్రియా ప్రకాష్ వారియర్”. “ఒరు అదార్ లవ్” అనే సినిమా నుంచి విడుదల చేసిన ఆ టీజర్ అప్పట్లో పెను సంచలనమే రేపింది. ఒక్క యూట్యూబ్ లోనే కాకుండా మొత్తం మన దేశంలోనే ఆ అమ్మాయి ఎవరు అన్నది పెద్ద టాపిక్ అయ్యింది.

మన తెలుగు యువతలో కూడా మంచి హాట్ టాపిక్ కావడంతో ఈ చిత్రంపై మన దగ్గర కూడా మంచి బజ్ ఏర్పడింది. అలా తెలుగులో ఈ చిత్రం మన దగ్గర గత ఏడాది “లవర్స్ డే” కి “లవర్స్ డే” అనే పేరుతోనే విడుదల అయ్యింది. అయితే అప్పుడు ఈ చిత్రాన్ని మిస్సయితే ఇప్పుడు మీరు ఫ్రీగా చూడొచ్చు.

వచ్చే జూన్ 6 నుంచి యూట్యూబ్ లో ఈ చిత్రం తెలుగు వెర్షన్ ప్రీమియర్ గా స్ట్రీమ్ కానుంది. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోగా రోషన్ అబ్దుల్ రాహూప్ హీరోగా నటించగా మరో హీరోయిన్ నూరిన్ షెరిఫ్ మరో హీరోయిన్ గా నటించింది.