వరల్డ్ ఫేమస్ లవర్ మరో అర్జున్ రెడ్డి!.. ఈసారి అదరగొట్టేనా?

Friday, September 20th, 2019, 07:09:41 PM IST

విజయ్ దేవరకొండ నటిస్తున్న సరి కొత్త చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ఓటీవలె టైటిల్ ని అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు విజయ్. మరో సరి లవ్ చిత్రం అనేసరికి ప్రేక్షకుల్లో ఈ చిత్రం పై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ రోజు (శుక్రవారం) విడుదల చేసిన ఫస్ట్ లుక్ విజయ్ నటించిన అర్జున్ రెడ్డి తరహాలో ఉందనడం లో సందేహం లేదు. నటుడిగా మంచి సినిమాలు చేస్తూనే, సోషల్ ఆక్టివిటీస్ లో కూడా చురుగ్గా పాల్గొనే విజయ్ మరోసారి యూత్ ని అట్ట్రాక్ట్ చేయడానికి వస్తున్నాడు.

వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ టైటిల్ ని అనౌన్స్ చేసి, ఫసల్ లుక్ రిలీజ్ చేసారు. విజయ్ అర్జున్ రెడ్డి తరహాలో భారీ గెడ్డం తో, చేతిలో సిగరెట్ తో, మొహం పై రక్తం మరకలు వున్నాయి. అర్జున్ రెడ్డి లో కూడా ఇదే రేంజ్ లో విజయ్ అదరగొట్టాడు. మరి ఈ చిత్రం అభిమానులను అలరిస్తుందో, లేదో తెలియాలంటే థియేటర్లలోకి వచ్చేదాకా వేచి చూడాలి.