ఆ డైరెక్టర్ ఫోటోను వాల్ పేపర్ గా పెట్టుకున్న విజయేంద్రప్రసాద్!

Friday, May 28th, 2021, 03:16:20 PM IST


ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలు అందించిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అలీతో సరదాగా కార్యక్రమం లో పాల్గొన్నారు. అయితే అలీ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఇండస్ట్రీ పై, రౌద్రం రణం రుదిరం చిత్రాల పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రచయిత గా సక్సెస్ అయ్యాను అని, కానీ దర్శకుడు గా సక్సెస్ కాలేదు అంటూ చెప్పుకొచ్చారు. సక్సెస్ కాలేక పోవడానికి కారణం తెలిస్తే పెద్ద హిట్ సినిమాలే తీసి ఉండే వాణ్ణి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇండస్ట్రీ లో రాజమౌళి కాకుండా మీకు నచ్చిన దర్శకుడు ఎవరు అంటూ అలీ అడగగా, పూరి జగన్నాథ్ గారు అంటూ చెప్పుకొచ్చారు. ఆయనంటే తనకు అసూయ అంటూ చెప్పుకొచ్చారు. నా శత్రువును ప్రతి రోజూ చూడాలని అనుకొని ఆయన ఫోటోను వాల్ పేపర్ గా పెట్టుకున్నా అంటూ చెప్పుకొచ్చారు.

అయితే అబద్ధాలు ఆడే వారికి ఇండస్ట్రీ లో చోటు ఉంటుంది అని, ఇండస్ట్రీ కి రావాలి అని అనుకొనే వాళ్ళు కూడా అబద్దాలాడటం నేర్చుకోవాలి అని సూచించారు. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా చూసారా అని అలీ అడగగా, చూసా అని, చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చారు. అందులో సర్ప్రైజ్ ప్యాకేజ్ అలియా భట్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె తెర పై కనిపించే సమయం తక్కువే కానీ, ప్రతి సీన్ లోనూ ఆమె కనిపిస్తుంది అంటూ విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.