నేను సాంప్ర‌దాయ మ‌హిళ‌నే.. కానీ పెళ్లికి ముందు శృంగారం త‌ప్పే కాదు..!

Wednesday, November 7th, 2018, 11:41:57 AM IST

కోలీవుడ్ హాట్ హాట్ బ్యూటీ యాషికా ఆనంద్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ మీ..టూకి మ‌ద్ద‌తు తెలుపుతూ తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాన‌ని.. ఒక సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు త‌న‌కు ఆఫ‌ర్ ఇవ్వాలంటే క‌మిట్‌మెంట్ ఇవ్వాల‌ని కోరాడ‌ని.. అయితే తాను ఒప్పుకోలేద‌ని.. ఆయ‌న కూడా బ‌ల‌వంత పెట్ట‌లేద‌ని అందుకే ఆయ‌న పేరు బ‌య‌ట‌పెట్ట‌డం లేద‌ని యాషిక అన్నారు.

ఇక అసలు మ్యాట‌ర్‌లోకి వెళితే.. త‌మిళ బిగ్‌బాస్‌తో మంచి ఫేమ్ సంపాదించిన యాషిక ఆనంద్ ఇటీవ‌ల్ విజ‌య్ దేవ‌ర‌కొండ నోటా చిత్రంలో న‌టించింది. ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో ఎలాంటి హ‌ద్దులు లేకుండా త‌న‌ అందాల‌ను సాంప్ర‌దాయంగా ఆర‌బోస్తున్న యాషిక పెళ్లికి ముందే క‌న్య‌త్వ కోల్పోతే త‌ప్పేమి కాద‌ని.. ఇప్పుడు అవ‌న్నీ కామన్ అయిపోయాయ‌ని బోల్డ్ వ్యాఖ్య‌లే చేసి సంచ‌ల‌నం రేపింది. యాషిక లాగే చాలామంది గ‌తంలో క‌న్య‌త్వం పై ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ హాట్ భామ కూడా నేను సాంప్ర‌దాయ మ‌హిళ‌నే కానీ పెళ్లికి ముందే శృంగారం త‌ప్పు కాదంటుంది. దీంతో ఇప్పుడీ మ్యాట‌ర్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments