పవన్ కళ్యాణ్ ను శిఖరం తో పోల్చిన నిఖిల్..!

Wednesday, July 22nd, 2020, 11:10:52 PM IST


తెలుగు సినీ పరిశ్రమ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో పవన్ కళ్యాణ్. కొద్ది సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఆయనకు యువ హీరోల్లో కూడా అభిమానులు ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేస్తూ, సినిమాలు కూడా తెరకెక్కించడం మనం చూస్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేసే వారికి ఒకేసారి గట్టి కౌంటర్ ఇచ్చారు యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్.

శిఖరం ను చూసి కుక్క ఎంత మొరిగినా, ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్దం అయింది గా అంటూ పవన్ కళ్యాణ్ ను శిఖరం తో పోల్చారు నిఖిల్ సిద్ధార్థ్. అయితే రామ్ గోపాల్ వర్మను పరోక్షంగా ఏకి పారేశారు. రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న పవర్ స్టార్ చిత్రం పై ప్రేక్షకులు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు గతం లో లక్షిస్ ఎన్టీఆర్ ను ఎంకరజ్ చేస్తూ వైరల్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇపుడు పవర్ స్టార్ చిత్రాన్ని పొగిడేస్తున్నారు.