“అరవింద సమేత” మొదటి రోజు భారీ రికార్డు దిశగా..?

Monday, October 8th, 2018, 07:51:07 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం “అరవింద సమేత” విడుదలకి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది.ఇప్పటికే నెట్ లో పెట్టిన టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున కూడా విడుదల చేస్తున్నారు.ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో అంచనాలు ఇంకా ఎక్కువ అయ్యాయి.ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు అన్ని షోలకు ఫిక్సిడ్ హైర్స్ లాక్ చేసేసారు.దీనితో భారీ రికార్డునే నమోదు చేస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఒక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మాత్రమే దాదాపు 27 నుంచి 30 కోట్లు షేర్ రావచ్చని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పుడున్నా పరిస్థితుల్లో అది కూడా పెద్ద కష్టమేమి కాదు అని కూడా అభిప్రాయపడుతున్నారు.ఒకవేళ అదే కానీ జరిగితే నాన్ బాహుబలి రికార్డు ఏర్పడుతుందనే చెప్పాలి.ఇప్పటికి మొదటి రోజు రికార్డుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ప్లాప్ చిత్రం అజ్ఞ్యాతవాసి పేరిట ఉన్న రికార్డును ఈ చిత్రం బద్దలుకొట్టేలా ఉందని అనుకుంటున్నారు.ఇప్పుడు యంగ్ టైగర్ అభిమానులు కూడా ఇదే విషయంపై ఈ నెల 11న విడుదల కాబోయే చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.