యూట్యూబ్ కిల్లర్స్ : యువరాజుకు ఎన్ని అవమానాలో..నాన్నపై హైపర్ ప్రేమ..!

Tuesday, September 27th, 2016, 11:55:05 PM IST

youtube-f
రాహుల్ పై బూటు ప్రయోగం :1 ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్రచారంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ బిజీగా ఉన్నాడు.రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ యువకుడు రాహుల్ పై బూటు విసిరాడు. దీనితో అక్కక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.రాహుల్ గాంధీ వేగంగా స్పందించి బూటు దెబ్బనుంచి తప్పించుకున్నాడు.ఆ సమయం లో అక్కడున్న కార్యకర్తలు ఆయువకుడిని గమనించి అతడిపై దాడికి ప్రయత్నించారు. దీనితో పోలీస్ లు కలగ జేసుకుని ఆయువకుడిని అదుపులోకి తీసుకున్నారు.దీనిపై స్పందించిన రాహుల్ ఇది బిజెపి, ఆర్ ఎస్ ఎస్ ల పనే అని మండిపడ్డారు.

వీడియో కోసం క్లిక్ చేయండి :

3సెల్ఫీ ఇష్టం లేని కొండచిలువ : రాజస్థాన్ లోని మౌంట్ అబు జిల్లాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ఆవరణంలోకి ఓ కొండా చిలువ ప్రవేశించింది. ఆసుపత్రి సిబ్బంది అటవీశాఖకు సమాచారం అందించడంతో అటవీశాఖ అధికారులు దానిని పట్టుకున్నారు.వారు దానిని తీసుకుని వెళుతుండగా ఓ యువకుడు అత్యుత్సాహంతో దానితో సెల్ఫీదిగబోయాడు. దీనితో కొండా చిలువ ఒక్క ఉదుటున అతనిపైకి దూకి దాడి చేయబోయింది.అదృష్టం బావుండి ఆ యువకుడికి ఎటువంటి హానీ జరగలేదు.

వీడియో కోసం క్లిక్ చేయండి :

 

మాస్ ని మెప్పించడానికి హైపర్.. : 2నేను శైలజ చిత్రంతో హీరో రామ్ చాలా కాలం తరువాత మంచి విజయాన్ని సొతం చేసుకున్నాడు.తాజాగా రామ్ హైపర్ చిత్రంతో రానున్నాడు.ఇటీవల ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ విడుదలయింది. ఈ ట్రైలర్ చూస్తుంటే రామ్ మాస్ ప్రేక్షకులని మెప్పించాడనికి చేస్తున్న ప్రయత్నమే హైపర్ అని అనిపిస్తోంది.ఈ చిత్రం లో రామ్ తండ్రిని అమితంగా ప్రేమించే యువకుడిపాత్రలో కనిపిస్తున్నాడు.చూద్దాం హైపర్ అయినా రామ్ కి మంచి మాస్ హిట్ ఇస్తుందో లేదో..?

వీడియో కోసం క్లిక్ చేయండి :

  •  
  •  
  •  
  •  

Comments