పవన్ , మహేష్ కి కూడా సాధ్యం కాని రికార్డ్ కొట్టిన పెళ్లి చూపులు

Saturday, November 5th, 2016, 12:46:45 PM IST

pellichoopulu
ఈ మధ్య కాలం లో ఒక సినిమా 100 రోజులు ఆడింది అంటే అదొక ప్రపంచ వింత అయిపొయింది. తెలుగు సినిమాలు 100 రోజులు ఆడినట్టు గుర్తు కూడా లేని పరిస్థితి లో పెళ్లి చూపులు సినిమా ఆ ఘనత ని చేజిక్కించుకుంది. మహా మహా పవర్ స్టార్ లూ, సూపర్ స్టార్ లు సైతం రెండు మూడు వారాల తరవాత సూపర్ హిట్ లతో కూడా థియేటర్ ల లోనుంచి చక్కా పోతుంటే పెళ్లి చూపులు సినిమా విడుదల అయ్యి 100 రోజులు దిఘ్విజయంగా పూర్తి చేసుకుంది. అతి తక్కువ బడ్జెట్ తో కేవలం కాన్సెప్ట్ ని మాత్రమే నమ్ముకుని తెరకెక్కిన పెళ్లి చూపులు జూలై 29న థియేటర్లలోకి వచ్చింది. విజయ్ దేవరకొండ-రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రం.. నవంబర్ 6తో వంద రోజులను పూర్తి చేసుకుంటోంది. హైద్రాబాద్ లాంటి సిటీలో ఓ సినిమా హండ్రెడ్ డేస్ ఆడడం.. పెళ్లి చూపులకే సాధ్యమయిందని చెప్పాలి. లోకల్ మార్కెట్లోనే కాదు.. యూఎస్ లో కూడా ఈ చిత్రం పెద్ద హిట్.