రేపే వైఎస్ జ‌గ‌న్‌ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌

Friday, June 7th, 2019, 07:16:52 PM IST

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కోసం గ‌త కొన్ని రోజులుగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ భారీ క‌స‌ర‌త్తులు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సాయంత్రానికి ఫైన‌ల్ టీమ్‌ని సిద్ధం చేయ‌బోతున్న జ‌గ‌న్ రేపు కొత్త టీమ్‌తో మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తం 19 మంది చేత మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయించ‌బోతున్నారు. ఇందు కోసం ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు. రేపు ఉద‌యం 11.49 నిమిషాల‌కు మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. 12 నుంచి అసెంబ్లీ స‌మావేశం ప్రారంభం కానున్న నేప‌థ్యంలో రేపు మంత్రుల ప్ర‌మాణ స్వీకారం జ‌రగ‌నుంద‌ని తెలిసింది.

మంత్ర వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సంబంధించిన ప్ర‌మాణ స్వీకారోత్స‌వ ఏర్పాట్ల కోసం సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం ఇప్ప‌టికే స‌మీక్ష‌ను నిర్వ‌హించి ప‌నుల‌న్నీ చ‌క‌చ‌కా పూర్తి చేయిస్తున్నారు. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో 45 శాతం బీసీలు, ఎస్సీ, ఎస్టీల‌కు పెద్ద ప‌టీ వేయ‌బోతున్నార‌ట‌. ఇక జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా వుండే నాకుల్లో అత్య‌ధికుల్ని మంత్రి ప‌ద‌వులు వ‌రించ‌నున్నాయ‌ని, అందులో రోజా కూడా వుండే అవ‌కాశం వుంద‌ని, ఆమె పేరు ప్ర‌ధానంగా వుంటుంద‌ని కొంత మంది చెబుతున్నారు. జ‌గ‌న్ ఆలోచ‌న ఎలా వుంద‌నేది రోజా విష‌యంలో రేప‌టి వ‌ర‌కు ఉత్కంఠ కొన‌సాగే అవ‌కాశం వుంద‌ని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక ఈసారి విస్త‌ర‌ణ‌లో త‌మ‌కు చోటు దొరుకుతుందంటూ త‌మ‌కు దొరుకుతుంది! అని ఆశించిన వారంద‌రిలో గుబులుగుబులుగా ఉంద‌ని ఒక‌టే ప్ర‌చారం హోరెత్తుతోంది.