రాజకీయాల్లోకి నందమూరి హీరోలు .. కారణం అదేనా ?

Saturday, March 24th, 2018, 09:57:45 AM IST


ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయాల రంగులు మారుతున్నాయి. 2019 లో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే దిశగా పలు పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక ఆంధ్రా లో తెలుగు దేశం పార్టీని మళ్ళీ గెలిపించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారు. అందుకే ఈ సారి నందమూరి వారసులు రాజకీయాల్లోకి .. అదే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ, హరికృష్ణ లు రాజకీయాల్లో ఉన్నారు. తాజాగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లను కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకొయ్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. నందమూరి అభిమానులు కూడా ఈ ఇద్దరు హీరోలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. తాజాగా రాజకీయాల్లోకి వస్తారా అని కళ్యాణ్ రామ్ ని అడిగితె అయన ఇప్పుడు ఏమి చెప్పలేం అంటూ దాటవేశారు. ఒకరకంగా ఆయనకు రాజకీయాల పై ఆసక్తి ఉందని, కానీ దానికి ఇంకా టైం పట్టేలా ఉందని చెప్పాడు. ఇక ఎన్టీఆర్ ను ఎలాగైనా సరే రాజకీయాల్లోకి లాగాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు దేశం తరపున మంచి పాపులర్ ఇమేజ్ ఉన్న స్టార్ ఇప్పుడు ఎన్టీఆర్ కాబట్టి .. ఆయనను ఈ రంగంలోకి దింపాలని చూస్తున్నారు. మరి ప్రత్యక్ష రాజకీయాల గురించి ఎన్టీఆర్ ఏమంటాడో చూడాలి.