కరోనా పరీక్షలలో ఏపీ రికార్డ్…10 లక్షలకు పైగా!

Sunday, July 5th, 2020, 05:31:20 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 10,17,140 కి చేరింది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఊహించని రీతిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం తో కంటెన్మెంట్ జోన్ లలో ఎక్కువగా ఆంక్షలు పెట్టడం జరిగింది. అంతేకాక కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఎక్కువగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తూ ప్రజలను త్వరితంగా కరోనా వైరస్ భారీ నుండి కొలుకొనెల చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకూ జరిపిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో 9,98,443 మందికి కరోనా వైరస్ నెగటివ్ అని తేలింది. అంతేకాక గడిచిన 24 గంటల్లో 998 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ 18,697 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 232 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.