సీఎం జగన్ ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బందికి కరోనా.. ఏకంగా 10 మందికి..!

Saturday, July 4th, 2020, 10:08:51 PM IST

ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద కరోనా కలకలం రేపుతోంది. 10 మంది భద్రతా సిబ్బందికి కరోనా సోకింది. ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్‌కు చెందిన 8 మంది భద్రతా సిబ్బందికి మరియు మరో బెటాలియన్‌కి సంబంధించిన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది.

అయితే ఈ నెల 2న సీఎం నివాసం వద్ద వారికి కరోనా టెస్టులు నిర్వహించగా టెస్టుల ఫలితాలను నేడు వెల్లడించారు. ఈ ఫలితాలలో పది మంది గార్డులకు కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఇక గతంలో సీఎం నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకింది.