ఏంటి..? నాని వచ్చి పదేళ్లయ్యిందా..?

Wednesday, September 5th, 2018, 06:10:18 PM IST

మొదట సినిమాల్లో క్లాప్ బాయ్ గా వచ్చాడు, ఆ తర్వాత బాపు, శ్రీను వైట్ల వంటి అద్భుత దర్శకుల వద్ద అసిస్టెంట్ దర్శకునిగా పని చేసాడు, ఆ తర్వాత ఆర్.జె గా కూడా చేసాడు, ఒక రోజు ఎదో ఒక సీన్ వివరిస్తూ తనకి తెలీకుండానే చక్కని నటన, హావభావాలు కనబరుస్తున్నాడు. ఆ దర్శకునికి ఆ సీన్ వారు అనుకున్న యాక్టర్ కన్నా ఈ అబ్బాయే బాగా చేస్తున్నాడు అనిపించుకున్నాడు, ఎన్నో విజయాలు అందుకున్నాడు, పరాజయాలను చవిచూసాడు కానీ అధైర్య పడలేదు లేచాడు, నిలబడ్డాడు, తానేంటో నిరూపించుకున్నాడు, ప్రతిభ ఉంటే బాక్గ్రౌండ్ అవసరం లేదు అని నిరూపించుకున్నాడు, అతని సహజమైన నటనతో ఎలాంటి సీన్ ని అయినా సరే అవలీలగా చేసేసి తనకంటూ ఒక బిరుదు ప్రేక్షకుల చేత పొందాడు.. అతడే మన “నాచురల్ స్టార్ నాని”.

వెండితెర కు “అష్ట-చమ్మ” అనే చిత్రంతో పరిచయమయ్యి ఈ రోజుతో సరిగ్గా పది సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ పది ఏళ్లలో ఎన్నో చిత్రాలు రైడ్ (2009), భీమిలి కబడ్డీ జట్టు (2010) వంటి మంచి చిత్రాలను తీసాడు కానీ ఆ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వం వహించిన అలా మొదలయింది (2011) చిత్రంతో మంచి బ్రేక్ ని అందుకున్నాడు. ఆ తర్వాత పిల్ల జమిందార్ (2011) తో మంచి విలువలున్న సినిమాని అందించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వం లో చిన్న పాత్ర ఐన సరే ఒప్పుకొని ఈగ (2012) చిత్రం చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అంతలా అలరించకపోయిన “ఎవడె సుబ్రహ్మణ్యం” తో ఫామ్ లోకి వచ్చాడు.

ఆ తర్వాత మారుతి దర్శకత్వం లో వచ్చిన “భలే భలే మగాడివోయ్” కామెడీ ఎంటర్టైనర్ లో మతిమరుపు మనిషిగా హాస్యాన్ని పండించాడు అంతే ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు వరుసగా ఆరు హిట్లతో డబుల్ హ్యాట్రిక్ తో దూసుకుపోయాడు. ఆ తర్వాత వచ్చిన “కృష్ణార్జున యుద్ధం” తో కాస్త నిరాశ పరిచాడు. కేవలం నటనలోనే కాకుండా “డీ ఫర్ దోపిడీ” “అ” వంటి విభిన్న చిత్రాలకి నిర్మాతగా కూడా వ్యహరించాడు. ప్రస్తుతం నాని బిగ్ బాస్ 2 అనే రియాలిటీ షో కి హోస్ట్ గా చేస్తూ ప్రజలు అందరి దగ్గర మన్ననలు పొందుతున్నాడు. వెండి తెరకి పరిచయం అయ్యి పదేళ్లు అయ్యినందుకు తన ఆనందాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments