వంద‌ల‌ ఎక‌రాల ముద‌పాక భూ కుంభ‌కోణం ప్ర‌కంప‌నాలు!!

Wednesday, January 25th, 2017, 10:53:02 AM IST

LAND
విశాఖ‌లో రోజుకో భూకుంభ‌కోణం బ‌య‌టికి వ‌స్తోంది. ప్ర‌త్యేక ఆంధ్ర‌లో కాస్ట్‌లీ సిటీగా, పారిశ్రామిక న‌గ‌రంగా పేరున్న విశాఖ ఔట‌ర్‌లో భూముల‌న్నీ క‌బ్జాల‌కు గుర‌వుతున్న వైనంపై నిత్యం టీవీ చానెళ్ల‌లో క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. స్థానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ‌కీయ‌నేత‌లు తోడేళ్లుగా మారి ఏజెన్సీ భూముల్ని సైతం క‌బ్జాలు చేసేస్తున్నారు.

విశాఖ ప‌రిస‌రాల్లోని ముద‌పాక గ్రామ‌స్తుల‌కు చెందిన భూముల్ని `ల్యాండ్ పూలింగ్‌` పేరుతో స్థానిక ఎమ్మెల్యే ఒక‌రు క‌బ్జా చేసేశార‌ని, వెయ్యి కోట్ల కుంభ‌కోణం ఇద‌ని ప్ర‌చారం సాగుతోంది. ల్యాండ్ పూలింగ్ జీవో ఇచ్చింది… అంటూ రైతుల నుంచి భూముల్ని బ‌ల‌వంతంగా లాక్కున్నార‌ని నిన్న‌టిరోజున బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుకు రైతులే స్వ‌యంగా ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. నిన్న‌టిరోజున విష్ణుకుమార్ రాజు ఈ విష‌యాన్ని మీడియా స‌మ‌క్షంలో తెర‌పైకి తీసుకొచ్చారు. మ‌రి ఈ గొడ‌వ ఎటు వెళుతుందో? ఇందులో వాస్త‌వాలేంటో తేలాల్సి ఉందింకా.