కరోనాను జయించిన 101 ఏళ్ల బామ్మ.. ఎక్కడో తెలుసా?

Thursday, April 2nd, 2020, 02:20:35 AM IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తుంది. అయితే రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండడం, జనాలు వైరస్ భారిన పడి పిట్టల్లా రాలిపోతుండడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది.

అయితే కరోనా వైరస్ అన్ని వయసుల వారికి వ్యాపిస్తుందని, కానీ దీని ప్రభావం ఎక్కువగా వృద్ధులపైనే ఉంటుందని, ఈ వ్యాధి బారిన పడి చనిపోయిన వారిలో వృద్ధులే ఎక్కువ శాతం ఉన్నారట. అయితే తాజాగా 101 ఏళ్ళ బామ్మ కరోనాను జయించడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నెదర్లాండ్‌కి చెందిన 101 ఏళ్ళ మహిళ తొలుత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి టెస్ట్‌లు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తరువాత వారం రోజులు ఐసోలేషన్‌లో చికిత్స తీసుకోవడం, టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యింది. అయితే ఈ వయసులో కూడా ఆమె వైద్య సలహాలను తప్పకుండా పాటించిందని అందుకే కరోనాను జయించిందని వైద్యులు అంటున్నారు.