బంజారా హిల్స్ లోని పీఎస్ లో కరోనా కలకలం…11 మందికి కరోనా వైరస్ పాజిటివ్

Monday, April 5th, 2021, 06:40:33 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ముఖ్యం గా హైదరాబాద్ నగరం లో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కువగా నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్ లోనే అధికం అని చెప్పాలి. అయితే తాజాగా బంజారా హిల్స్ లోని పోలీస్ స్టేషన్ లో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. మొత్తం స్టేషన్ లో 11 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అందులో సీఐ, ఎస్సై లతో పాటుగా 9 మంది కానిస్టేబుళ్లు సైతం ఉన్నారు. పీఎస్ లో ఇన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడం పట్ల ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.