నల్గొండలో కరోనా కల్లోలం.. ఒకే రోజు 14 మంది పోలీసులకు పాజిటివ్..!

Sunday, June 28th, 2020, 01:49:53 AM IST


తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఒక్క హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా మిగతా జిల్లాలలో కూడా కరోనా కేసులు బాగానే నమోదవుతున్నాయి. అయితే తాజాగా నల్గొండలో ఒకే రోజు 14 మంది పోలీసులకు కరోనా సోకడం తీవ్ర కలకలం రేపింది.

అయితే ఆ 14 మందిలో ఎస్పీ గన్‌మెన్‌కూ కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఎస్పీకి కూడా కరోనా పరీక్ష చేస్తే నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే మళ్ళీ ఆయనకు పరీక్షలు చేసే అవకాశం ఉంది. ఇక ఇద్దరు గన్‌మెన్స్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో నలుగురు, టూ టౌన్‌లో ఒకరు, క్యాంప్ ఆఫీస్‌లో ఒకరు, ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహించే ఆరుగురు పోలీసులు పాజిటివ్ వచ్చిన ఈ జాబితాలో ఉన్నారు.