15ఏళ్ళ కుర్రాడు నన్ను లైంగికంగా వేధించాడు : ప్రముఖ హీరోయిన్

Monday, May 21st, 2018, 11:04:19 PM IST


ఇటీవల చిన్న, పెద్ద, వావి, వరస, వయో బేధం అనే తేడా లేకుండా కామ వాంఛతో కొందరు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఈ ప్రపంచం ఎటుపోతుందో అనిపించక మానదు. మొన్నటికిమొన్న దాచేపల్లి, కథువా, వున్నావ్ వంటి ఘటనల్లో చిన్నపిల్లలపై కొందరు మృగాళ్లు పశువుల్లా ప్రవర్తించి అత్యాచారం చేసిన ఘటనలు ఎప్పటికి మరువలేనివి. ఇక నేడు ప్రముఖ హీరోయిన్ సుస్మిత సేన్ తనకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయని, అయితే ఆ పని చేసింది ఒక 15 ఏళ్ళ కుర్రాడు అని జరిగిన ఘటనను చెప్పుకొచ్చింది సుస్మిత. ఇటీవల ముంబైలో జరిగిన మేక్ యార్ సిటీ ముంబై కార్యక్రమంలో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సుస్మిత ఆరునెలల క్రిందట తనపై జరిగిన లైంగిక దాడిని వివరించారు. ఒక అవార్డుల ఫంక్షన్ కు వెళ్లిన తనను అక్కడ అంతా రద్దీగా ఉండడంతో 15ఏళ్ళ కుర్రాడు వెనకనుండి తన చేతిని పట్టుకుని తప్పుగా ప్రవర్తించాడని, ఆ రద్దీలో నేను అతన్ని గుర్తించలేను అనుకున్నాడు.

కాని చివరికి అతన్ని గుర్తుపట్టి చూస్తే అతనికి 15ఏళ్ళు కూడా లేవని, అతన్ని చూసి షాక్ అయ్యాను అన్నారు. నేను నీ మెడ పట్టుకుని నువ్వు ఇలా చేసావని అరిచి అందరిని పిలిచి గోల చేస్తే నువ్వు ఏమి చేస్తావ్, తర్వాత నీ లైఫ్ ఏమవుతుంది అని అడిగాను. అప్పుడు మొదట తాను చేసిన తప్పును ఆ కుర్రాడు ఒప్పుకోలేదని, గట్టిగా గద్దించేసరికి భయపడి సారీ తప్పు చేశాను, ఇకపై ఇలాంటి తప్పులు చేయనని అనేసరికి అతని భవిష్యత్తు పాడవుతుందనే ఉద్దేశంతో వదిలిపెట్టినట్లు సుస్మిత చెప్పారు. నిజానికి ఇటువంటి వారిని వదల కూడదని, తల్లి తండ్రులు తమ బిడ్డలను ఎదుగుతున్నపుడు ఒకటికి రెండు సార్లు సంఘంలో ఎలా ఉండాలో, ఎలా వుండకూడదో వారికి తెలియ చెప్పాలని, ఆలా చేసిన పక్షంలో కనీసం కొంతవరకైనా ఆడవారిపై ఇలాంటి వేధింపులు తగ్గే అవకాశం ఉందని సుస్మిత అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments