15 ఏళ్ల బన్నీ సినీ జీవితాన్ని తలిపిస్తూ వైరల్ అయిన కొత్త పోస్టర్

Wednesday, March 28th, 2018, 06:47:08 PM IST

అల్లు అర్జున్ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని హిట్ల మీద హిట్లు కొడుతూ ఎన్ని ఒడి దుడుకులు ఎదురైనా వాటికి ఎదురీదుతూ ముందుకు వెళ్తున్న కుర్ర హీరో. కేవలం నటనలోనే కాదు తన డ్యాన్సు, డ్రెస్సింగ్ స్టయిల్, ఫైట్స్ ఒకటేంతో ప్రతీ విషయంలో ఎవరితో పోటీ పడకుండా తనకు తానె పోటీ అంటూ తీసే ప్రతీ సినిమాలో ఎప్పుడూ ఒక కొత్తదనంతో అభిమానులను అలరిస్తాడు. ఒకవైపు నటనను ఎంత ఇష్టపదతాడో మరోవైపు తన ఫ్యామిలీని, స్నేహితులను, అభిమానులను కూడా అంటే ఇష్టపడతాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక గొప్ప చిత్రాన్ని తన రికార్డులో ఎక్కించుకున్న అల్లు అర్జున్ 15 సంవత్సరాలుగా విభిన్నమైన చిత్రాలతో అలరిస్తున్నాడు.

అప్పటి 2003 మార్చి 28 నాడు విడుదల అయిన గంగోత్రి నుంచి మొదలు పెడితే సరిగ్గా మళ్ళీ 2018 మర్చి 28 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేస్కొని అన్ని రకాల పాత్రలతో కలిపి 22 సినిమాలు పూర్తి చేస్కొని ఇప్పుడు తన 23వ సినిమా నాపేరు సూర్య అనే దేశ భక్తి కథానికతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే అల్లు అర్జున్ సిని రంగ ప్రవేషం చేసి ఇప్పటికి 15 అమ్వత్సరాలు పూర్తి అయినందున నాపేరు సూర్య చిత్ర బృందం అల్లు అర్జున్ పేరిట ఒక ప్రత్యేక పోస్టర్ని రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పోస్టర్ అభిమానులను తెగ మురిసిపోఎలా చేస్తుంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో, శ్రీధర్ లగడపాటి, నాగేంద్ర బాబు నిర్మాతలుగా రామలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై రానున్న ఈ చిత్రానికి విశాల్ శేఖర్ సంగీతం అందించగా ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసారు. వచ్చే మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సర్వత్రా సిద్దం చేస్తున్నారు.