హైదరాబాద్ పోలీస్ అకాడమీ లో 180 మందికి సోకిన కరోనా!

Sunday, June 28th, 2020, 10:01:37 PM IST

కరోనా వైరస్ మహమ్మారి దేశమంతా ఆందోళనలను సృష్టిస్తుంది. రోజుకి 400 కి పైగా ప్రాణాలను ఒక్క మన దేశంలోనే బలి తీసుకుంటోంది. అయితే హైదరాబాద్ లో ఇప్పటికే ఉగ్ర రూపం దాల్చిన కరోనా, ఇక్కడ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి రాష్ట్ర పోలీస్ అకాడమీ లోని ప్రవేసించింది. అక్కడ శిక్షణ పొందుతున్న పోలీస్ అధికారుల నుండి సిబ్బంది వరకు మొత్తం 180 మందికి కరోనా వైరస్ సోకింది. అయితే ఇందులో ఒక ఐపిఎస్ అధికారి, ముగ్గురు అడిషనల్ డీఎస్పీ లు, ముగ్గురు డీఎస్పీ లతో పాటు గా ఎస్సై లకు కూడా కరోనా వైరస్ సోకినట్లు అకాడమీ డైరెక్టర్ తెలిపారు.

అయితే ఈ మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అక్కడే వారిని ఇసొలేశన్ లో ఉంచనున్నారు. అంతేకాక అక్కడ శిక్షణ పొందుతున్న 1100 మంది ఎస్సై లు, 600 కు పైగా కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయనున్నారు. అంతేకాక అక్కడ మిగతా 2,200 మందికి కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయనున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇపుడు పోలీస్ అకాడమీ లో సైతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం తో అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు.