1 జూన్‌ `రాజుగాడు` క‌మింగ్‌

Sunday, May 6th, 2018, 12:50:31 PM IST

వ‌రుస విజ‌యాల‌తో జోరుమీదున్న రాజ్‌త‌రుణ్‌కి మ‌ధ్య‌లో స‌డెన్ బ్రేక్‌. అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మించిన `రంగుల రాట్నం` ఊహించ‌ని జోల్ట్ ఇచ్చింది. పెద్ద బ్యాన‌ర్‌లో రాంగ్ స్టోరి ఎంచుకున్నాడ‌ని ప్రూవైంది. ఆ క్ర‌మంలోనే అత‌డు న‌టించిన ఓ రెండు సినిమాలు రిలీజ్ ముంగిట‌కు వ‌స్తున్నాయి. రాజుగాడు, ల‌వ‌ర్ .. ఈ రెండు చిత్రాలు ముగింపు ద‌శ‌లోనే ఉన్నాయి. మ‌హిళా ద‌ర్శ‌కురాలు సంజనా రెడ్డి దర్శకత్వంలో ‘రాజుగాడు’ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. తాజాగా జూన్ 1 రిలీజ్ అంటూ పోస్ట‌ర్‌ని లాంచ్ చేశారు.

పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజ్‌ తరుణ్‌ సరసన అమైరా దస్తూర్ క‌థానాయిక‌. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి గోపి సుందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాతో డెబ్యూ డైరెక్ట‌ర్ సంజ‌న పెద్ద హిట్ కొట్టి మ‌హిళా ద‌ర్శ‌కురాలి జాబితాలో త‌న‌కో్ చోటు ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. సంజ‌న ఇదివ‌ర‌కూ ఏబీఎన్‌లో లైఫ్‌స్టైల్ రిపోర్ట‌ర్‌గా కొన‌సాగారు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కురాలిగా కెరీర్ జ‌ర్నీ ప్రారంభించారు.