వైరల్ వీడియో : ఆకాశంలో 2.0 ప్రమోషన్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

Friday, October 27th, 2017, 08:16:07 PM IST


ఇండియాలో మొట్టమొదటి సారి అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2.0 చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా విడుదల కాకముందే ఈ సినిమా అంచనాలను భారీగా పెంచుతోంది. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా ఆకాశపు అంచులను తాకేట్లు సినిమా ప్రమోషన్స్ చేస్తోంది. ఇప్పటికే దుబాయ్ లో వేడుకలు ఆకాశాన్ని తాకగా ఇటీవల 2.0 పోస్టర్ తో ముగ్గురు స్కై డైవర్స్‌ ఆకాశంలో చేసిన విన్యాసం అందరిని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం దానికి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ – అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ 450 కోట్లతో నిర్మించింది. ఈ సినిమా 2018 జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా త్రీడి లో విడుదల కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments