2.0 సినిమా రన్ టైమ్ అంతేనా?

Sunday, October 29th, 2017, 02:20:33 AM IST

శంకర్ – రజినీకాంత్ కలయికలో రాబోతోన్న 2.0 సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే సినిమా ఆడియో వేడుక దుబాయ్ లో ఘనంగా జరగడంతో ఇప్పుడు హాలీవుడ్ ప్రముఖులు కూడా ఆ సినిమా ఎలా ఉండబోతోందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుండి ఎదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. సినిమాలో రజినీకాంత్ తో పాటు అక్షయ్ కుమార్ కూడా నటిస్తుండడంతో బాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా సినిమా రిలీజ్ కానుంది.

అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక న్యూస్ బాగా వినిపిస్తోంది. శంకర్ సినిమాల రన్ టైమ్ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిన విషయమే. దాదాపు మూడు గంటల వరకు సినిమాను ఆసక్తిగా చుసేటట్టు తెరకెక్కిస్తాడు. మినిమమ్ ఆయన సినిమాలు 170 నిమిషాల నిడివి సమయం కంటే తక్కువ ఉండవు. కానీ 2.0 సినిమా నిడివి సమయం మాత్రం కేవలం 140 నిముషాలు మాత్రమే ఉంటుందట. ఈ రోజుల్లో ఎక్కువగా సినిమాలు రన్ టైమ్ ని బాగా తగ్గించేస్తున్నాయి. హాలీవుడ్ సినిమాలు కూడా 120 నిమిషాల లోపే ఉంటాయి. బహుశా శంకర్ కూడా అదే ఆలోచనతో ఈ సారి అంతే రన్ టైమ్ లో చూపించాలని అనుకుంటున్నాడో ఏమో? చూద్దాం ఎంతవరకు మెప్పిస్తాడో..

  •  
  •  
  •  
  •  

Comments