2.0 రన్ టైమ్ అంతేనా?

Thursday, January 11th, 2018, 08:18:11 PM IST

భారతదేశంలోనే మొదటి సారి పూర్తి 3డి టెక్నాలిజీతో తెరకెక్కిన స్కై ఫై చిత్రం 2.0. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఈ భారి బడ్జెట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఫైనల్ గా ఏప్రిల్ నెలలో రిలీజ్ కాబోతోంది. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా సినిమా రన్ టైమ్ గురించి చిత్ర యూనిట్ ఒక వివరణ ఇచ్చింది. మొత్తం సినిమా 100 నిముషాలు ఉండనుందట. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చాలా సినిమాలు దాదాపు 3 గంటల వరకు ఉంటాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండడంతో 2.0 రన్ టైమ్ ని తక్కువగా ఉంటేనే బెటర్ అని కేవలం 100 నిమిషాలు మాత్రమే సెట్ చేశారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. దాదాపు రూ.450 కోట్లతో లైకా ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మించింది. రజినీకాంత్ – అక్షయ్ కుమార్ వంటి స్టార్ నటులు సినిమాలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు తమిళ్ అలాగే హిందీ అరబిక్ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.