స్నీక్‌పీక్‌ : 2.ఓ మేకింగ్ పార్ట్ 4

Tuesday, October 2nd, 2018, 12:14:47 PM IST

సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్- శంక‌ర్- అక్ష‌య్‌కుమార్‌ కాంబినేష‌న్ మూవీ 2.ఓ నవంబ‌ర్ 29న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. 2018 మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. ఇటీవ‌లే రిలీజ్ చేసిన టీజ‌ర్ కోట్లాది మంది వీక్ష‌ణ‌తో యూట్యూబ్‌, సామాజిక మాధ్య‌మాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ తొలివారంలో ట్రైల‌ర్‌ని లాంచ్ చేసేందుకు శంక‌ర్ బృందం స‌న్నాహ‌కాల్లో ఉంది. ఈలోగానే స్నీక్ పీక్ – 2.ఓ మేకింగ్ పార్ట్ 4 అంటూ ఓ విజువ‌ల్‌ని లైవ్ చేసింది శంక‌ర్- లైకా బృందం.

ఈ స్నీక్ పీక్ ఫెంటాస్టిక్. ఇందులో ర‌జ‌నీ చిట్టీ రోబోట్ లుక్, అక్కీ – క్రోమ్యాన్ గెట‌ప్, ఎమీజాక్స‌న్ లేడీ రోబో గెట‌ప్ మైమ‌రిపించాయి. వీటి కోసం మేక‌ప్ స‌హా వీఎఫ్ఎక్స్‌లో ఎలా శ్ర‌మించారో విజువ‌ల్స్‌లో చూపించారు. అలానే 3డి కెమెరాలు, టెక్నాల‌జీని ఎలా ఉప‌యోగించారో శంక‌ర్ బృందం వెల్ల‌డించారు. టెక్నిక‌ల్ గా బోలెడ‌న్ని వివ‌రాల్ని 2.ఓ టీమ్ వెల్ల‌డించింది. 2150 వీఎఫ్ఎక్స్ షాట్స్‌, 1000 కాంప్లెక్స్‌ వీఎఫ్ఎక్స్ షాట్స్‌, 1300 ప్రీవిజ‌న్ షాట్స్‌, వి-క్యామ్ టెక్నాల‌జీ, స్పైడ‌ర్ కామ్ సిస్ట‌మ్స్‌, లిడార్ స్కానింగ్ .. ఇలా టెక్నాల‌జీ అప్‌డేట్స్‌ని టీజ‌ర్‌లో రివీల్ చేశారు. 25 కంపెనీలు వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ విభాగంలో ప‌ని చేశాయి. 10 మంది కాన్సెప్టు ఆర్టిస్టులు, 25 మంది 3డి డిజైన‌ర్లు, 500 మంది క్రాఫ్ట్‌మెన్ ఈ చిత్రానికి ప‌ని చేశారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత క‌ర‌ణ్ జోహార్ బాహుబ‌లి త‌ర్వాత ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఉత్త‌రాదిన రిలీజ్ చేస్తున్నారు.