మ‌హేష్‌, బ‌న్నిల‌కు క్రేజీ `2.ఓ` సెగ‌?

Monday, November 13th, 2017, 01:30:38 PM IST

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, స్టైలిష్ స్టార్ బ‌న్ని .. ఈ ఇద్ద‌రికీ ర‌జ‌నీకాంత్ పంచ్ ఇవ్వ‌బోతున్నారా? ర‌జ‌నీ-శంక‌ర్‌ల `2.ఓ` సెగ ఓ రేంజులో తాక‌నుందా? అంటే అవుననే విశ్లేషిస్తున్నారు. 2.ఓ రిలీజ్ తేదీపై క్లారిటీ రాక‌పోవ‌డం, పైగా వాయిదాల ఫ‌ర్వంలో వ‌స్తుండ‌డం మ‌న హీరోల‌కు సంక‌టంగా మార‌బోతోంద‌ని చెబుతున్నారు. స్టోరిలోకి వెళితే..

సూప‌ర్‌స్టార్ మహేష్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. ఈ ఇద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ వ‌చ్చే స‌మ్మ‌ర్ బ‌రిలో దిగిపోయేందుకు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ న‌టిస్తున్న `భ‌ర‌త్ అనే నేను`, బ‌న్ని న‌టిస్తున్న `నా పేరు సూర్య‌` .. రెండూ ఒకేరోజు అంటే ఏప్రిల్ 27న రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. కూచుని మాట్లాడుకుందామ‌ని అల్లు అర‌వింద్ – దాన‌య్య ఫిక్స‌యినా వాళ్లు ఏం మాట్లాడుకున్నారో ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రికీ ఏమీ తెలియ‌దు. ఒక‌వేళ వాళ్లు మాట్లాడుకున్నా మ‌హా అయితే వారం గ్యాప్‌తో వ‌చ్చేస్తార‌ని భావిస్తే, ఆ టైమ్‌లో ఆ ఇద్ద‌రికీ ఎర్తింగ్ పెట్టేందుకు వేరొక జెయింట్ బ‌రిలో దిగిపోతున్నాడు. ఆ జెయింట్ ఎవ‌రో అంద‌రికీ తెలిసిందే. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఏప్రిల్ బ‌రిలో వార్‌కి వ‌స్తున్నాడ‌న్న స‌మాచారం ఇప్ప‌టికే ఉంది. ఇక ర‌జ‌నీ -శంక‌ర్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న 2.ఓ సినిమా 13 ఏప్రిల్ రిలీజ్ అంటున్నారు కాబ‌ట్టి.. ఆ మేర‌కు మ‌హేష్‌, బ‌న్నిల‌కు థ్రెట్ త‌ప్ప‌దు. 2.ఓ రిలీజ్ తేదీ ప‌లుమార్లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. తొలుత 12.12.2017న ర‌జ‌నీ పుట్టిన‌రోజు కానుక‌గా రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ రిప‌బ్లిక్ డే కానుక‌గా 26 జ‌న‌వ‌రి 2018లో వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. కానీ అదీ వాయిదా వేస ఏప్రిల్ 13 అంటున్నారు. అయితే అప్పుడైనా వ‌స్తుందా? అనే సందేహం జ‌నాల్లో ఉంది. ఒక‌వేళ వాయిదాల ఫ‌ర్వంలో వ‌స్తే మ‌హేష్‌, బ‌న్ని ఇద్ద‌రికీ అది ఓ రేంజులో పంచ్ ప‌డే ఛాన్సుంటుంద‌ని చెబుతున్నారు. ర‌జ‌నీ సినిమా కాస్త అటూ ఇటూ అయితే, 27 ఏప్రిల్‌న వ‌స్తున్న‌ భ‌ర‌త్ అనే నేను, నా పేరు సూర్య‌ల‌కు సెగ తాకే చాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు. జ‌స్ట్ వెయిట్‌.. ఏం జ‌ర‌గ‌బోతోందో?

  •  
  •  
  •  
  •  

Comments