`2.ఓ` మీమ్స్.. ఇదోర‌కం పిచ్చి!

Friday, September 14th, 2018, 07:17:45 PM IST

కికిఛాలెంజ్‌, బ‌కెట్ ఛాలెంజ్‌, హ‌రిత‌హారం ఛాలెంజ్ అంటూ చాలానే వ‌చ్చాయి. ఇవ‌న్నీ యువ‌త‌రంలో జోరుగా వైర‌ల్ అయ్యాయి. ఇది అలాంటి ఛాలెంజ్ కాదు కానీ, ఇదో డిఫ‌రెంట్ ప‌బ్లిసిటీ స్టంట్‌. యూత్ పిచ్చిగా అనుస‌రించే ప్ర‌క్రియ‌. త‌మ‌కు ఏదైనా సీన్ లేదా డైలాగ్ క‌నెక్ట‌యితే దానిని మీమ్స్ (MEMES) పేరుతో సామాజిక మాధ్య‌మాల్లో పాపుల‌ర్ చేయ‌డం చూస్తున్నాం.

ఇటీవ‌లే `సుయ్ ధాగ‌` కోసం అనుష్క శ‌ర్మ ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్‌పై సెటైరిక‌ల్‌గా మీమ్స్‌ని క్రియేట్ చేసి వాటిని వెబ్‌లో విప‌రీతంగా ప్ర‌చారం చేశారు. అవ‌న్నీ బోలెడంత వినోదాన్ని పంచాయి. యూత్‌లో అప్ప‌టిక‌ప్పుడు పుట్టుకొచ్చే ట్రెండ్ ఇది. కాలేజ్ యూత్ పిచ్చిగా దీనిని పాలో అయిపోతుంటారు. తాజాగా 2.ఓ టీజ‌ర్‌లోని సెల్‌ఫోన్లు గాల్లో లేచే సీన్‌లో న్యూస్ 7 చానెల్‌ యాంక‌ర్ సీరియ‌స్‌గా ఆ వార్త‌ను గ్యాప్ లేకుండా చ‌దివేస్తుంటుంది. దానిని మాయ‌దారి యూత్ ఫుల్ ఫ‌న్ కోసం మీమ్స్‌లోకి లాగేశారు. రిపీటెడ్‌గా ఆ ఒక్క సీన్ రిపీట‌య్యేలా మీమ్స్‌ని పాపుల‌ర్ చేశారు. ప్ర‌స్తుతం ఇది సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఇక ఈ త‌ర‌హా మీమ్స్ సంద‌డి ఇటు ద‌క్షిణాది కంటే ఉత్త‌రాదిన మ‌రీ ఎక్కువ‌. బాలీవుడ్‌లో ఏదైనా వెరైటీ అనిపిస్తే చాలు దానిని వెంట‌నే మీమ్స్‌లోకి తెచ్చేస్తూ ప్రాచుర్యం క‌ల్పిస్తోంది యూత్. ఇక ఈ వినాయ‌క చ‌వితి కానుక‌గా రిలీజైన 2.ఓ టీజ‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా జోరుగా వ్యూస్‌ని ద‌క్కించుకుంటూ 10 కోట్ల వ్యూస్ దిశ‌గా వెళుతున్న సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments