బీజేపీలోకి ఇద్దరు వైసీపీ ఎంపీలు – షాక్ లో జగన్

Friday, August 16th, 2019, 02:46:26 AM IST

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీతో కేంద్రంలో వరుసగా రెండవసారి అధికారాన్ని సొంతం చేసుకున్న భారతీయ జనతా పార్టీ, ఇకమీదట దేశమంతటా ఒక్క బీజేపీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా బలోపేతం కావడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. కాగా ఈ ప్రయత్నాన్ని ముందుగా రెండు తెలుగురాష్ట్రాల్లో ప్రారంబంచిందని చెప్పాలి. అయితే ఈమేరకు ఏపీలో ప్రధాన ప్రతిపక్ష స్తానంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీలో అసమ్మతిగా ఉన్నటువంటి నేతలందరినీ తన పార్టీలో కలిపేసుకుంది బీజేపీ. ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచినా వారితో పాటే ఓడిపోయినవారందరిని కూడా బీజేపీలో కలిపేసుకున్నారు బీజేపీ పెద్దలు. అంతేకాకుండా ఈ నెల 18న ఒక భారీ భహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు కూడా… ఇక ఇపుడు ఏపీలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ మీద బీజేపీ కన్ను పడింది…

అయితే ఇపుడు ఏపీలోనూ వైసీపీ ఎంపీలు ఇద్దరు బీజేపీలో చేరతారని ప్రచారం జోరందుకుంది. అది కూడా గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీకి అండగా ఉంటున్నటువంటి రెడ్డి సామజిక వర్గానికి చెందిన నేతలు అని సమాచారం. ఇకపోతే ఆ ఇద్దరు ఎంపీలుకూడా వైసీపీ పార్టీలో చాలా కీలకమైన నేతలని సమాచారం. కానీ ఇదంతా ఒక మైండ్ గేమ్ అని, వైసీపీ ఎంపీలు ఇద్దరు బీజేపీలో చేరుతారనే వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. కానీ ఇవే నిజమైన వార్తలని ఆ ఎంపీలకు సంబందించిన వారు కొందరు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. అయితే ఒకవేళ నిజంగానే ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరిపోతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎం చేస్తారో చూడాలి మారి…