తేజ్ ట్రైల‌ర్‌కి 20ల‌క్ష‌ల వ్యూస్‌

Friday, June 29th, 2018, 07:04:58 PM IST

సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా – తేజ్ .. ఐ ల‌వ్ యు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌. క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌కుడు. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ మూవీ మేక‌ర్స్‌ ప‌తాకంపై కె.ఎస్‌.రామారావు నిర్మించారు. ఈ సినిమా త్వ‌ర‌లో రిలీజ్‌కి రానుంది. ఇటీవ‌లే రిలీజ్ చేసిన తేజ్ ట్రైల‌ర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇప్ప‌టికి 20ల‌క్ష‌ల వ్యూస్ సాధించింది ఈ ట్రైల‌ర్‌.

ట్రైల‌ర్‌లో సాయిధ‌ర‌మ్ అభిన‌యం, అనుప‌మ క్యూట్ అప్పియ‌రెన్స్ యూత్‌కి పిచ్చిగా న‌చ్చేశాయి. క‌రుణాక‌ర‌న్ మ‌రోసారి త‌న‌దైన శైలిలో పూర్తి వినోదాత్మ‌క ప్రేమ‌క‌థా చిత్రాన్ని ప్రేక్ష‌కాభిమానుల‌కు అందిస్తున్నార‌ని అర్థ‌మైంది. అనుప‌మ పోలీస్ క‌మిష‌న‌ర్ కుమార్తెగా ఈ చిత్రంలో న‌టిస్తోంది. క‌మీష‌న‌ర్ కూతురికి లైనేసే కుర్రాడిగా సాయిధ‌ర‌మ్ న‌టిస్తున్నాడు. అయితే ప్రేమ కోసం అంత మోసం చేస్తావా? అంటూ అనుప‌మ చెప్పిన డైలాగ్‌ని బ‌ట్టి అన్ని ప్రేమ‌క‌థ‌ల్లానే ఈ క‌థ‌లోనూ చాలా ట్విస్టులే ఉన్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమా ఇటు తేజ్‌కి, అటు క‌రుణాక‌ర‌న్‌కి ఎంతో కీల‌క‌మైన‌ది. త‌ప్ప‌నిస‌రిగా విజ‌యం సాధించి కెరీర్‌ని చ‌క్క‌దిద్దుకోవాల్సిన స‌న్నివేశంలో వ‌స్తున్న‌ది.