టీఆర్ఎస్ మహిళా కార్పోరేటర్‌కి 20 వేల జరిమానా.. ఎందుకంటే..!

Saturday, May 23rd, 2020, 11:37:41 PM IST

టీఆర్ఎస్ మహిళా కార్పోరేటర్‌కు మంత్రి కేటీఆర్ 20 వేల జరిమానా విధించారు. హైదరాబాద్ నగరంలో అనధికారికంగా ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయవద్దని ఇదివరకే జీహెచ్ఎంసీ సూచించిన సంగతి తెలిసిందే.

అయితే ఎర్రగడ్డ డివిజన్‌ పరిధిలోని సుల్తాన్‌నగర్‌బస్తీ ప్రాంతంలో నేడు బస్తీ దవాఖానాను ప్రారంభించడానికి మంత్రి కేటీఆర్‌ వచ్చారు. అయితే ఆ ప్రాంతంలో మంత్రి కేటీఅర్‌కి స్వాగతం పలుకుతూ స్థానిక కార్పొరేటర్‌ షహీన్‌ బేగం ఓ ప్లెక్సీ ఏర్పాటు చేయుంచింది. అయితే దీనిపై ఆగ్రహించిన కేటీఆర్ ప్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని తెలిసినా కూడా నిబంధనలు అతిక్రమించి ప్లెక్సీ ఏర్పాటు చేయడంపై మహిళా కార్పోరేటర్‌కి 20 వేల జరిమానా విధించారు.