2015 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవ్వనున్న కలిస్

Wednesday, August 21st, 2013, 04:06:48 PM IST

JAQUES
దాదాపు ఏడాదిన్నరగా వన్డే క్రికెట్‌కు దూరంగా ఉంటున్న దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ జాక్వస్ కలిస్ పునరాగమనం చేయనున్నాడు. ఈ నవంబరులో భారత్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌లో ఆడనున్నట్లు ప్రకటించాడు. కెరీర్‌లో కనీసం ఒక్క వన్డే ప్రపంచకప్ అయినా గెలవాలనేది తన కల అని, 2015లో దానిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నించి రిటైర్ అవుతానని తెలిపాడు.