కొత్త ప్రయోగం ..

Thursday, December 29th, 2016, 06:02:55 PM IST

charan-ntr
తెలుగు సినిమా ఈ ఏడాది కొత్త పుంత‌లు తొక్కింది. అగ్ర‌క‌థానాయ‌కుల చిత్రాల‌కంటే కొత్త‌గా ప‌రిచ‌య‌మైన ద‌ర్శ‌కులు, న‌టులు ఆద‌ర‌ణ పొందారు. అగ్ర‌క‌థానాయ‌కుల చిత్రాల్లో కూడా సీరియ‌స్ కంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కే పెద్ద‌పీట వేశారు. తెలుగు రాష్ర్టాలు రెండుగా విడిపోయినా.. క‌థ‌లు మాత్రం ఇద్ద‌రికీ న‌చ్చేవిగా తీసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా రొటీన్ చిత్రాల‌ను ప్రేక్ష‌కులు గండికొట్టారు. దాంతో కొత్త జోన‌ర్ అంటూ..థ్రిల్ల‌ర్ చిత్రాలు వ‌చ్చాయి. దానితో పాటు దెయ్యం కాన్సెప్ట్‌లు ముందుకు వ‌చ్చాయి. ఈ ఏడాది కథానాయకుల స‌క్సెస్‌లు కొంత‌మేర‌కే ద‌క్కాయి.

రొటీన్‌కు బ్రేక్‌

రొటీన్‌గా క‌థానాయ‌కుడు చాచిపెట్టి గుద్దితే ప‌ది మంది ఎగిరిప‌డాలి. ఇలాంటివి న‌వ్వుకోవ‌డానికి బాగుంటాయి. అందుకే చాలా చిత్రాల్లో అవిపెద్ద‌గా క‌న్పించ‌లేదు. నేచుర‌ల్‌గా వుండే యాక్ష‌న్ చిత్రాల‌ను క‌థానాయ‌కులు పెద్ద‌పీట వేశారు. అయితే ఒక క‌థానాయ‌కులు ఇద్ద‌రు లేదా ముగ్గురు నాయిక‌లు వుండాల్సిందే అనే రూలు మాత్రం పెట్టుకున్నారు. క‌థ‌ల‌కు బోలెడంత హంగామాల‌తో ముందుకు వ‌చ్చారు. ప‌నిలోప‌నిగా క‌థ‌ల్లో కొత్త‌ద‌నం దొర‌క్క ప‌లువురు పొరుగు బాష‌ల్లో సిద్ధ‌మైన‌ క‌థ‌లు తెర‌కెక్కించారు. దాంతో కొన్నిసార్లు కొత్త క‌థ‌లతో థ్రిల్ల‌ర్ చేస్తూ సేఫ్‌గా భావిస్తున్నారు. మొద‌ట్లో చిన్న సినిమాల‌కే ప‌రిమిత‌మైన థ్రిల్ల‌ర్‌ కాన్సెప్ట్‌లు స్టార్ క‌థానాయ‌కుల స్థాయికి వ‌చ్చేశాయి.

ఎన్‌టిఆర్‌కు రెండు హిట్లు

రెండేళ్ల‌నాడు ద‌ర్శ‌కుడు సుకుమార్ మ‌హేష్‌బాబుతో ‘వ‌న్’ అనే చిత్రం చేశాక, ఆ చిత్రం న‌చ్చి ఎన్‌టిఆర్ సుకుమార్ డైరెక్ష‌న్ లో చేయ‌డానికి ముందుకువ‌చ్చాడు. దాంతో ‘నాన్న‌కు ప్రేమ‌తో’ చేశాడు. సెంటిమెంట్ డ్రామాతో గ‌ట్టెక్కింది. ఆ త‌ర్వాత మోహ‌న్‌లాల్ ప్ర‌ధాన పాత్ర‌తో ‘జ‌న‌తా గ్యారేజ్’ చేయ‌డంతో అదికూడా ఫ‌ర్వ‌లేద‌నిపించింది. ఎన్‌టిఆర్‌కు ఈ ఏడాది రెండు హిట్లు ఇచ్చింది. వెంక‌టేష్‌కు..’బాబు బంగారం’ అనే సినిమా ఫ‌ర్వాలేదు అనిపించేలా చేసింది. మారుతీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఇద్ద‌రికీ సేఫ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది.

రామ్‌చ‌ర‌ణ్ ‘బ్రూస్‌లీ’ త‌ర్వాత ఏం సినిమా చేస్తాడ‌నే అంద‌రూ అనుకుంటుండ‌గా స్వంత క‌థ‌లు చేయ‌డానికి జంకాడ‌నే చెప్పాలి. దాంతో సురేంద‌ర్ రెడ్డి తీసుకువ‌చ్చిన క‌థ‌ను కాద‌ని బ‌ల‌వంతంగా త‌మిళ చిత్రాన్ని చూపించి ఆయ‌న‌చేత ద‌ర్శ‌క‌త్వం చేయించాడు. ‘త‌ని ఒరువ‌న్’ చిత్రాన్ని ‘ధృవ‌’గా రీమేక్ చేశాడు. ఐపీఎస్‌కీ, శాస్ర్త‌వేత్త‌ మ‌ధ్య జ‌రిగే మైండ్ గేమ్ ఇది. ఇందులో అర‌వింద్ స్వామి విల‌న్‌గా మంచి మార్కులు సంపాదించారు. వీరే కాకుండా దాదాపు అందరు కథానాయకుల ఆలోచనలు థ్రిల్లింగ్ వైపుగా సాగుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments