షాకింగ్‌ : బాల‌ల చ‌ల‌న‌చిత్రోత్సవాలు లైట్‌ తీస్కున్నారు!

Wednesday, November 15th, 2017, 04:32:56 PM IST

గ‌త వారం రోజులుగా హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ బాల‌ల చ‌ల‌న‌చిత్రోత్స‌వాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఉత్స‌వాల్లో ఇరుగుపొరుగు నుంచి దేశ విదేశాల నుంచి వంద‌లాది మంది టాప్ సెల‌బ్స్ విచ్చేశారు. అయితే ఇందులో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు మాత్రం మిస్స‌వ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఓ ర‌కంగా తెలుగు సినిమా పెద్ద‌లు ఈ ఉత్స‌వాల్ని లైట్ తీస్కున్నార‌నే అర్థ‌మైంది. హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నేటితో ముగిసిపోయాయి. శిల్ప‌క‌ళా వేదిక‌లో ముగింపు ఉత్స‌వంలో సినిమాటోగ్ర‌ఫీ మంత్రి తలసాని శ్రీ‌నివాస‌యాద‌వ్ తూ.తూ మంత్రంగా పెద్దంత‌గా ఆక‌ర్ష‌ణ లేకుండానే కానిచ్చేశారు. అయితే అస‌లు ఈ ఉత్స‌వాల్ని ఈ రేంజులో టాలీవుడ్ జ‌నం లైట్ తీస్కోవ‌డం చూస్తే విచారం క‌ల‌గ‌క‌మాన‌దు. ప్రపంచం న‌లుమూల‌ల నుంచి ఎంతో ఉత్సాహంగా, ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఫిలింమేక‌ర్స్ ఇక్క‌డికి వ‌స్తే, మ‌నోళ్లు మాత్రం ప‌క్క‌నే ఉండి ఇంట్లోంచి క‌ద‌ల‌నే లేదు. అందుకే ఈసారి ఉత్స‌వాల‌కు పెద్దంత‌గా క‌ళ లేనేలేద‌ని అంతా విమ‌ర్శిస్తున్నారు. ఇక ఈ ఉత్స‌వాల్లో అవార్డులు అందుకున్న వాటిలో అసలు తెలుగు సినిమాలేవైనా ఉన్నాయా? అన్న‌ది కూడా మ‌న తెలుగు జ‌నాల‌కు తెలియ‌క‌పోవ‌డం విచార‌క‌రం. ఇక అవార్డుల జాబితాల్ని ప‌రిశీలిస్తే ఇలా ఉన్నాయి డీటెయిల్స్‌…

ఫీచర్ ఫిలింస్‌- అవార్డులు
* ఉత్తమ దర్శకుడు – రీమా దాస్‌(విలేజ్‌ రాక్‌స్టార్స్‌)
* ఉత్తమ చిత్రం(అడల్ట్‌ జ్యూరీ) – హౌరా
* ఉత్తమ చిత్రం(చైల్డ్‌ జ్యూరీ) – టెన్నిస్‌ బడ్డీస్‌
* స్పెషల్‌ జ్యూరీ – భానితాదాస్‌(విలేజ్‌ రాక్‌స్టార్స్‌)

షార్ట్‌- లైవ్‌ యాక్షన్ పార్ట్ అవార్డులు
* ఉత్తమ దర్శకుడు – ప్రణవ్‌ హరిహర్‌ శర్మ(1869)
* ఉత్తమ స్క్రీన్‌ప్లే – విసెంట్‌ బోనెట్‌, ఫైనా మారిన్‌(స్పుత్నిక్‌)
* ఉత్తమ నటి – అయేషా అహ్మద్‌(మీడియం)
* ఉత్తమ చిత్రం(అడల్ట్‌ జ్యూరీ) – మీడియం
* ఉత్తమ చిత్రం(చిల్డ్రన్‌ జ్యూరీ) – ఫిష్‌
* ఉత్తమ దర్శకుడు – జీసస్‌ పరేజ్‌, గర్డ్‌ గోకెల్‌(క్యాట్స్‌ అండ్‌ డాగ్స్‌)
* ఉత్తమ స్క్రీన్‌ప్లే – న్యాన్‌ క్యాల్‌ సే(మై లైఫ్‌ ఐ డోంట్‌ వాంట్‌)
* ఉత్తమ చిత్రం(చిల్డ్రన్‌ జ్యూరీ) – మై లైఫ్‌ ఐ డోంట్‌ వాంట్‌
* రెండో ఉత్తమ చిత్రం – ది మస్కిటో పీక్స్‌
* స్పెషల్‌ జ్యూరీ – ది మ్యూజికల్‌ డ్రాగన్‌

ఫీచర్‌ యానిమేషన్ -అవార్డులు
* ఉత్తమ దర్శకుడు – రూన్‌ స్పాన్స్‌, రస్మూసా సివర్ట్‌సన్‌(టూ బడ్డీస్‌ అండ్‌ బాడ్జర్‌)
* ఉత్తమ స్క్రీన్‌ ప్లే – అలైన్‌ గాగ్నాల్‌(ఫాంటమ్‌ బాయ్‌)
* ఉత్తమ చిత్రం(అడల్ట్‌ జ్యూరీ) – ఫాంటమ్‌ బాయ్‌
* ఉత్తమ చిత్రం(చిల్డ్రన్‌ జ్యూరీ) – ది ఆడ్‌సాకీటర్స్‌

ఫీచర్‌ లైవ్‌ యాక్షన్ అవార్డులు
* ఉత్తమ దర్శకుడు – డాగ్‌మర్‌ సీమే(విండే)
* ఉత్తమ స్క్రీన్‌ ప్లే – మైక్‌ డీ జాంగ్‌(మిస్టర్‌ ఫ్రాగ్‌)
* ఉత్తమ నటి – గయా ఫోర్ట్‌(ఈదెల్‌)
* ఉత్తమ చిత్రం(అడల్ట్‌ జ్యూరీ) – మిస్టర్‌ ఫ్రాగ్‌
* ఉత్తమ చిత్రం(చిల్డ్రన్‌ జ్యూరీ) – విండే
* పాఠక్‌(బువా), ఇనాముల్‌హక్‌(టైలర్‌)
లిటిల్‌ డైరెక్టర్‌
* ఉత్తమ చిత్రం – ది గ్రోసరీ స్టోర్‌ ఆఫ్‌ డ్రీమ్‌
* రెండో ఉత్తమ చిత్రం – డియర్‌ డాడ్‌
* ఉత్తమ దర్శకత్వం (స్పెషల్‌ జ్యూరీ) – ఫీడింగ్‌ డైవర్సిటీ

లఘుచిత్రం -అవార్డులు
* ఉత్తమ దర్శకుడు – షారియర్‌ పొర్సెయేదియన్‌(రెడ్‌ డ్రీమ్‌)
* ఉత్తమ చిత్రం(చిల్డ్రన్‌ జ్యూరీ) – స్టాంప్‌ అల్బమ్‌
* స్పెషల్‌ జ్యూరీ – చియెరీ టు చెర్రీ

  •  
  •  
  •  
  •  

Comments