2017 సంక్రాంతి శాతకర్ణిదే అంటున్న యువ హీరో

Friday, December 30th, 2016, 04:55:57 PM IST

nara-rohith
నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తన 100 వ చిత్రం కోసం ఎన్నో కథలు విన్నారు. ఎంతో మంది దర్శకులతో చేయాలనుకున్నారు. దీంతో దర్శకుడు క్రిష్ చెప్పిన కథే తన ప్రతిష్టాత్మక చిత్రానికి కరెక్ట్ అన్న అభిప్రాయానికి వచ్చి క్రిష్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుండి నిత్యం జనం నోళ్ళలో నానుతూనే ఉంది. ఇటీవలే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కూడా జరిగింది. ఈ ఫంక్షన్ లో దర్శకుడు క్రిష్ మాటతీరు చుస్తే అతనికి ఈ సినిమాపై ఎంత నమ్మకం ఉందో అర్ధమవుతుంది. ఈ సినిమా వచ్చే నెల సంక్రాంతి కి విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో యువ హీరో నారా రోహిత్ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను సినిమాను పూర్తిగా చూడక పోయినప్పటికీ, అందులో కొన్ని సన్నివేశాలను మాత్రం చూశానని చెప్పారు. ఆ సన్నివేశాలు చూశాక తనకు నోట మాట రాలేదని, సినిమా అద్భుతంగా ఉందని రోహిత్ అన్నారు. 2017 లో ఆసక్తిని రేకెత్తించే సినిమా అంటే గౌతమీపుత్ర శాతకర్ణిదే అని అన్నారు. నా అదృష్టం బాగుండి ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసే అవకాశం వచ్చిందని, సినిమా అద్భుతం అని వ్యాఖ్యానించి ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశారు

  •  
  •  
  •  
  •  

Comments