2017లో టాప్-5 పైరేటెడ్ మూవీస్ ఇవే..

Thursday, January 18th, 2018, 03:46:34 PM IST

2017లో అత్యధికంగా పైర‌సీకి గురైన సినిమా ఏది? ఎక్కువ‌మంది ఆన్‌లైన్ పైర‌సీ లింకుల్ని షేర్ చేసుకున్న‌ది ఏ సినిమాని? అంటే ఇవిగో వివ‌రాలు. పైర‌సీపై జ‌ర్మ‌నీకి చెందిన ప్ర‌ముఖ ఐటీ కంపెనీ టెక్ జిపియో జీఎంబిహెచ్ సంస్థ ప‌రిశోధ‌న‌లో తేలిన నిజాలివి. 2017లో టాప్ -1 పైరేటెడ్ మూవీగా షారూక్ ఖాన్ `రాయీస్‌` అత్య‌ధిక పాయింట్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. హృతిక్ కాబిల్‌ని అత్య‌ధికులు పైర‌సీలో వీక్షించారు. జాలీ ఎల్ఎల్‌బి 2, టాయ్‌లెట్, గోల్‌మాల్ ఎగైన్‌ చిత్రాలు ఆ త‌ర్వాతి స్థానంలో నిలిచాయి.

రాయీస్ -6.2 మిలియ‌న్ల సార్లు, కాబిల్ -5.26 మిలియ‌న్ షేర్స్‌, జాలీ ఎల్ఎల్బి 2-4.43 మిలియ‌న్ షేర్ల‌తో, టాయ్‌లెట్‌-4.27 మిలియ‌న్ షేర్స్‌తో, గోల్‌మాల్‌ ఎగైన్‌-3.83 మిలియ‌న్ షేర్స్‌తో వ‌రుస‌గా టాప్ 5లో ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్, యుఏఈల్లో ఎక్కువగా పైర‌సీ లింకులు షేర్ అయ్యాయ‌ని స‌ర్వే నిగ్గు తేల్చింది. పాకిస్తాన్, సౌదీలో షారూక్ రాయీస్, హృతిక్ కాబిల్ చిత్రాల‌ను పైర‌సీలో ఎక్కువ చూశారు. బ‌ద్రీనాథ్ కా దుల్హానియా, జుడ్వా 2, ది ఘాజీ ఎటాక్‌, హాఫ్ గాళ్ ఫ్రెండ్ చిత్రాల్ని పైర‌సీలో ఎక్కువ‌గా చూశారు.