టాప్ స్టోరి : 2018 అందాల క్వీన్‌ల‌దే!

Thursday, January 25th, 2018, 10:55:54 AM IST

2018లో మోస్ట్ అవైటెడ్ సినిమాలెన్నో. అందులో తొలిగా `ప‌ద్మావ‌త్‌` అత్యంత క్రేజీగా రిలీజై సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ సినిమా లేడి ఓరియెంటెడ్ సినిమా. ప‌ద్మావ‌త్ రాణి చ‌రిత్ర‌కు సంబంధించిన సినిమా. ఇక ఈ ఒక్క సినిమాయేనా? అంటే ఈ ఏడాదిలో అంత‌కుమించి క్రేజీ సినిమాలు రానున్నాయి. కంగ‌న ర‌నౌత్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న హిస్టారిక‌ల్ సినిమా `మ‌ణిక‌ర్ణిక‌` వారియ‌ర్ క్వీన్ బ్యాక్‌డ్రాప్ సినిమా. స్వ‌తంత్ర సంగ్రామ పోరాట యోధురాలు ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ వీర‌గాధ‌ను వెండితెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ఏప్రిల్ 27న ఈ సినిమా రిలీజ్‌కి రానుంది.

తెలుగులో `అరుంధ‌తి` ఫేం అనుష్క న‌టిస్తున్న `భాగ‌మ‌తి` ఈ శ‌నివారం అత్యంత క్రేజీగా రిలీజ‌వుతోంది. ఈ సినిమా చ‌రిత్ర నేప‌థ్యంలోని లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఫిక్ష‌న్ సినిమా. భాగ‌మ‌తిగా అనుష్క పెర్ఫామెన్స్ మ‌తి చెడ‌గొట్ట‌డం ఖాయ‌మ‌ని ట్రైల‌ర్లు చెబుతున్నాయి. 2018 ద్వితీయార్థంలోనూ పలు నాయికా ప్ర‌ధాన చిత్రాలు రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతున్నాయి. అందాల స‌మంత క‌థానాయిక‌గా `యూట‌ర్న్‌` తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రాన్ని స‌మంత స్వ‌యంగా న‌టిస్తూ నిర్మిస్తున్నారు. నిత్యామీన‌న్ క‌థానాయిక‌గా ట్రాన్స్ జెండ‌ర్ బ్యాక్‌డ్రాప్ సినిమా నాయికా ప్రాధాన్య‌త‌తో తెర‌కెక్కుతున్న‌దే. ఇదే గాక శ్ర‌ద్ధాక‌పూర్ నాయిక‌గా తెర‌కెక్క‌నున్న సైనా నెహ్వాల్ బ‌యోపిక్ అంతే ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఇవ‌న్నీ నాయికా ప్రాధాన్య‌త ఉన్న సినిమాలు.. క్రేజీగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.