2018 క్యాలెండ‌ర్ బోయ్స్ మ‌హేష్‌, ఎన్టీఆర్

Wednesday, January 3rd, 2018, 01:20:30 AM IST

హీరోల పేర్ల‌తో మార్కెట్లో న్యూఇయ‌ర్ క్యాలెండ‌ర్లు రిలీజ్ చేయ‌డం అన్న‌ది ప‌రిపాటి. ఎప్ప‌టినుంచో ఉన్న సాంప్ర‌దాయ‌మే అయినా మెగాస్టార్‌, యువ‌ర‌త్న ఆరంగేట్రంతో ఫ్యానిజం రెట్టింపై అటుపై అది పీక్స్‌కి చేరింది. ఆ క్ర‌మంలోనే త‌మ అభిమాన హీరోల ఫోటోల‌తో ప్ర‌త్యేకించి క్యాలెండ‌ర్లు వేసి, క్ర‌య‌విక్ర‌యాలు సాగించ‌డం మొద‌లైంది. త‌మ అభిమాన హీరోల గ్రీటింగ్ కార్డ్స్‌తో పాటు, క్యాలెండ‌ర్లు విక్ర‌యించ‌డం అన్న సంస్కృతి మెగాస్టార్ ప్ర‌భంజ‌నంతోనే మొద‌లైందంటే అతిశ‌యోక్తి కాదు. ఇంట్రెస్టింగ్ గా వాటికి జ‌నాల్లోనూ అంతే డిమాండ్ ఉండేది.

కాల‌క్ర‌మంలో అభిమాన సంఘాలు ప్ర‌త్యేకించి ఈ క్యాలెండ‌ర్ల‌ను ముద్రించి అంద‌రికీ పంచేవి. స‌ద‌రు హీరోల అభిమానుల‌ను క్యాచ్ చేసేందుకే కొన్ని బిజినెస్ వ‌ర్గాలు ప‌బ్లిసిటీ కోసం ఇలా చేసేవి. త‌మ బ్రాండ్ల ఫోటోల్ని ఆయా కేలెండ‌ర్ల‌పై ముద్రించి హీరోల ఫోటోల పేరుతో ప్ర‌మోష‌న్ తెచ్చుకునేవారు. అయితే ఇప్పుడు ఆ త‌ర‌హా క్యాలెండ‌ర్ల‌కు కాలం చెల్లింది. ఇప్పుడంతా ఈ ప్ర‌పంచం. ఆన్‌లైన్లో ఫోటోల్ని, క్యాలెండ‌ర్ల‌ను షేర్ చేసుకోవ‌డ‌మే ఇప్పుడున్న ప్ర‌త్యేక‌త‌. అది కూడా ఎలాంటి ఖ‌ర్చు లేకుండా. ఇదిగో 2018 క్యాలెండ‌ర్ బోయ్స్ మ‌హేష్‌, ఎన్టీఆర్ .. క్యాలెండ‌ర్లు వెబ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మునుముందు చ‌ర‌ణ్‌, బ‌న్ని, ప‌వ‌న్ త‌దిత‌రుల క్యాలెండ‌ర్లు వ‌చ్చేస్తాయిట‌. వీటిని మొబైల్ వాల్ పేప‌ర్లుగానూ సెట్ చేసుకోవ‌చ్చు. అక్క‌డే క్యాలెండ‌ర్లో ముఖ్య‌మైన తేదీల్ని చూసుకునే వెసులుబాటు ఉంటుంది. మొత్తానికి స్టార్ల క్యాలెండ‌ర్లు చివ‌రికి బుల్లిపెట్టెకు ప‌రిమితం కావాల్సొచ్చింద‌న్న‌మాట‌!!