బిగ్ న్యూస్: అమరావతిలో 220 కోట్ల విలువ చేసే భూమి కొన్నది వీరే!

Thursday, January 23rd, 2020, 08:45:22 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్తితులు మారుతున్నాయి. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పిన జగన్ రాజధాని ప్రాంతం విషయం లో కీలక నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు వాస్తవాలుగా మారుతున్నాయి. అమరావతిలో పెద్ద భూ కుంభకోణం జరిగిందని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని కొందరు పేద ప్రజలను కోట్లు విలువ చేసే భూ యజమానులుగా చూపించారని అన్నారు.

సీఐడీ జరిపిన దర్యాప్తు ప్రకారం, 797 మంది తెల్ల రేషన్ కార్డు దారులు, ఒక్కొక్కరికి నెలకు ఐదు వేల ఆదాయం కంటే తక్కువ వున్న వారు 2014-15 సంవత్సరాల్లో అమరావతిలో 220 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కొనుగోలు చేసినట్లు తేలింది. అయితే వీరికి సంబంధించిన ఆదాయపు పన్ను మరియు రిజిస్ట్రేషన్ లలో పన్ను ఎగవేత మనీ లాండరింగ్ ఫై దర్యాప్తు చేపట్టామని ఈడీ ని కోరింది. అయితే ఈ భూమి కొనుగోలుదారుల్లో చాల మందికి పాన్ కార్డులు కూడా లేవని, ఐటీ చెల్లించలేదని వారి దర్యాప్తులో తేలింది.

2014 లో తెలంగాణ విడిపోయాక ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని అవసరం కావడం తో అమరావతిలో 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం పూల్ చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉండేలా పరిపాలన రాజధానిగా విశాఖని ఎంచుకోవాలని జగన్ మూడు రాజధానుల నిర్ణయం తెరపైకి తీసుకొచ్చారు. అయితే చంద్రబాబు హయం లో 2014-15 ప్రాంతంలో అమరావతి ప్రకటనకు ముందు అనుమానాస్పద భూమి రిజిస్ట్రేషన్లు జరిగాయని, ఈ భూ కొనుగోళ్ల విషయం లో భారీగా నగదు లావాదేవీలు జరిగాయని సీఐడీ అధికారులు ఆదాయపు పన్ను శాఖ వారికి లేఖలో తెలిపారు.

అంతేకాకుండా భూమిని కొన్న వ్యక్తుల యొక్క పూర్తీ వివరాలు, ఎంత భూమిని కొన్నారో, దాని మార్కెట్ విలువ ఇంతకీ అమ్మలో మొత్తం వివరాలని ఐటీ వారికీ ఇచ్చారు పోలీసులు. ఈడీ అధికారులు, మనీ లాండరింగ్ గురించి పరిశీలించాలని పోలీసులు పోలీసులు కోరారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 761 ఎకరాలని కొనుగోలు చేసిన వారిలో దాదాపు 797 మంది గుంటూరుకి చెంది, తెల్ల రేషన్ కార్డు కలిగి వున్నవారు. వీరిలో 529 మందికి పాన్ కార్డులు లేవు. అయితే అమరావతి కోసం తుళ్లూరు లో అత్యధికంగా అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని తెలిపారు. అయితే తాత్కాలిక సచివాలయం మరియు హైకోర్టు భవనాల కొనుగోలు విషయం లో ఇదే ధోరణి జరిగిందని తెలిపారు. అయితే ఈ భూములు కొనుగోలు చేసినందుకు టీడీపీ మాజీ మంత్రి పత్తిపాటి పులరావు, పి. నారాయణ ఫై సీఐడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది.