23 ఏళ్ల నాటి ఐసూ సీక్రెట్స్‌ లీక్‌!

Sunday, December 3rd, 2017, 07:52:10 PM IST

భార‌తీయ వ‌నిత మానుషి చిల్ల‌ర్ ప్ర‌పంచ సుంద‌రిగా కిరీటం గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 15ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఈ కిరీటం ఇండియాకి ద‌క్క‌డానికి కార‌ణ‌మైంది. ఇక ఇదే సంద‌ర్భంలో మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ కి సంబంధించిన నాటి సీక్రెట్ ఒక‌టి లీకైంది. అందాల పోటీల్లో సీరియ‌స్‌గా ఉన్న త‌న‌ని విప‌రీతంగా అభిమానించి, త‌న అందానికి స్పెల్ బౌండ్ అయిపోయిన మునుప‌టి ప్ర‌పంచ సుంద‌రి .. టాప్ మోడ‌ల్ న‌వోమి క్యాంప్‌బెల్ వ‌ల్ల‌నే ఐసూకి ఆ కిరీటం ద‌క్కింది. రీసెంటుగానే ముంబైలో జ‌రిగిన మ‌హిళాసాధికార‌త‌, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలకు సంబంధించిన స‌మ్మిట్‌లో పాల్గొన‌డానికి వ‌చ్చిన న‌వోమి ఈ విష‌యాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు.

1994లో అందాల పోటీల్లో ప్ర‌పంచ సుంద‌రి కిరీటం ఎవ‌రికి ఇవ్వాలి? అనుకున్న‌ప్పుడు ఐసూ అందం త‌న‌ని విశేషంగా ఆక‌ట్టుకుంద‌ని న‌వోమి క్యాంప్‌బెల్ తెలిపారు. 23 ఏళ్ల వ‌య‌సులో త‌న‌కు ఆ అవ‌కాశం ద‌క్కింద‌ని తెలిపింది. ఐశ్వ‌ర్యారాయ్‌ని చూడ‌గానే `ఓ మైగాడ్ షీ ఈజ్ స్ట‌న్నింగ్‌` అని మ‌న‌సులో అనుకుని త‌న‌కే ఓటేశాన‌ని తెలిపారు. అందం-బ‌ల‌మైన వ్య‌క్తిత్వం ఉంటే, వ‌ర్ణంతో ప‌ని లేకుండా అందాల కిరీటం ద‌క్కించుకోవ‌డం సులువునేని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments