మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన 24 క్రాఫ్ట్స్!

Saturday, April 21st, 2018, 02:08:52 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో అందరికి తెలిసిందే. పవన్ ఒక్కసారిగా తన ట్వీట్స్ తో చిత్ర పరిశ్రమలో కొత్త కథలికలను తెచ్చారు. అయితే ఆ వివాదం ఎటు వెళుతుందో గాని టాలీవుడ్ పై ఇక నుంచి ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం సినీ పెద్దలు 24 క్రాఫ్ట్స్ కు చెందిన ప్రతినిధులతో సమావేశాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేశారు.

ఉదయం నిర్వహించిన ఆ సమావేశం దాదాపు రెండున్నర గంటలకు పైగా కొనసాగింది. క్యాస్టింగ్ కౌచ్ అలాగే టాలీవుడ్ సమస్యలపై 24 క్రాఫ్ట్స్ కు చెందిన ప్రతినిధులు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఇండస్ట్రీ ప్రముఖులపై కావాలని చేసే వ్యక్తిగత ఆరోపణలను కూడా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండాలని అందుకు తగిన చర్యలను తీసుకోవాలని ఈ సమావేశంలో చర్చించారు. అయితే ఈ మీటింగ్ అనంతరం ఏ ఒక్కరు మీడియా ముందుకు రాలేదు. ముఖ్యంగా ఈ సమావేశంలో మొదట పవన్ కళ్యాణ్ హాజరవుతారని అంతా అనుకున్నారు. కానీ భద్రతా కారణాల రీత్యా ఆయన రాలేదని తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో 24 క్రాఫ్ట్స్ కమిటీలతో పవన్ చర్చలు జరపనున్నారని సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments