`కాలా` పంచ్ 25కోట్లు?

Tuesday, June 12th, 2018, 09:12:59 AM IST

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – పా.రంజిత్‌- ధ‌నుష్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `కాలా` తెలుగు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు భారీగా పంచ్ ఇవ్వ‌నుందా? అంటే అవున‌నే స‌మాచారం. `కాలా` పంచ్ తెలుగు, హిందీ రిలీజ్‌ల‌పై భారీగా ఉంద‌ని ట్రేడ్ డిక్లేర్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రేడ్ గ‌ణాంకాల ప్ర‌కారం.. తెలుగు రాష్ట్రాల్లో కాలా చిత్రం కేవ‌లం 7కోట్ల మేర షేర్ వ‌సూలు చేసింది. ఇక్క‌డ ఓవ‌రాల్ బిజినెస్ 33 కోట్లు. అంటే ఇంకో 25కోట్ల మేర షేర్ వ‌సూలు చేస్తేనే పంపిణీదారుల సొమ్ము వెన‌క్కి వ‌చ్చిన‌ట్టు. ఇక ఇత‌ర‌త్రా భార‌త‌దేశంలోనూ 6కోట్ల షేర్ మాత్ర‌మే వ‌సూలు చేసింది. ఒక్క త‌మిళ‌నాడు, మ‌లేషియా త‌ప్ప అన్నిచోట్లా ఈ సినిమా డిజాస్ట‌ర్ ఫలితం అందుకోవ‌డంపై పంపిణీదారులు, బ‌య్య‌ర్ల‌లో ఒక‌టే ఆస‌క్తికర చ‌ర్చ సాగుతోంది.

ర‌జ‌నీ మానియా ఏమైందో.. ఎందుకు ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొందో అంటూ ఒక‌టే ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని కేవ‌లం ముఖ విలువ ఉప‌యోగించి ధ‌నుష్ స్వ‌యంగా రిలీజ్ చేశార‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. కాబ‌ట్టి .. ఎన్.వి.ప్ర‌సాద్ (ఆంధ్రా రిలీజ్‌), దిల్‌రాజు(నైజాం రిలీజ్‌)ల‌కు వ‌చ్చే న‌ష్టం ఏమీ ఉండ‌ద‌న్న వాద‌నా వేరొక కోణంలో వినిపిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments