ఏ వయసులో పెళ్లి చేసుకుంటే బాగా సుఖపడతారో తెలుసా..?

Thursday, June 9th, 2016, 03:04:24 AM IST


పెళ్లి.. మనిషి జీవితంలో దీనికి ప్రధాన ప్రాముఖ్యత ఉంది. ప్రతి మనిషీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి పెళ్లి దోహదం చేస్తుంది. కానీ ఈ మధ్య కాలమ్లో పెళ్లి చేసుకున్న జంటలు ఏవేవో చిన్న చిన్న కారణాల వల్ల తమ వైవాహిక జీవితాన్ని వృదా చేసుకుంటున్నారు. ఈ పొరపాటుకు అనేక కారణాలున్నప్పటికీ వాటిలో ప్రధానమైనది వయసు. సరైన వయసులో వివాహం చేసుకుంటే వారి మధ్య బంధం ఎక్కువకాలం నిలబడుతుంది. అలాకాక ఎటూ కానీ వయసులో అంటే ముందుగానో లేకపోతే లేటుగానో చేసుకుంటే ఇబ్బందులు తప్పవు.

8 ఏళ్ల పాటు ఇండియాలో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 28 – 32 ఏళ్ల మధ్యలో పెళ్లి చేసుకున్న వారు అన్ని విధాలా అన్యోన్యంగా ఉంటూ ఎక్కువకాలం సుఖంగా జీవిస్తున్నారట. 28 – 32 ఏళ్ల వయసున్న ఆడ, మగవారు మానసికంగా, శారీరకంగా పరిపూర్ణంగా పరిణితి చెంది ఉండటమే ఇందుకు కారణమట. ఈ పరిణితి వలన వారు ఎటువంటి ఇబ్బందికర సమస్యలనైనా విజయవంతంగా ఎదుర్కొని నిలబడి తమ వైవాహిక జీవితానికి ఇబ్బంది కలగకుండా జీవిస్తున్నారట. సో 28 నుండి 32 ఏళ్ళ మధ్య వయసే పెళ్ళికి సరైన వయసని పరిశోధకులు సూచిస్తున్నారు.